Rohit – Kohli : నవంబర్ 30 న చరిత్ర సృష్టించనున్న కోహ్లీ-రోహిత్ జోడీ.. సౌతాఫ్రికా మ్యాచ్‌తో సచిన్-ద్రవిడ్ రికార్డు బ్రేక్
భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. సౌతాఫ్రికాతో త్వరలో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో స్టార్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జోడీ ఒక అరుదైన చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు కలిసి 391 మ్యాచ్‌లు ఆడారు.

Rohit – Kohli : భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. సౌతాఫ్రికాతో త్వరలో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో స్టార్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జోడీ ఒక అరుదైన చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు కలిసి 391 మ్యాచ్‌లు ఆడారు. ఇదే సంఖ్యలో క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ జోడీ కూడా మ్యాచ్‌లు ఆడారు. కాబట్టి నవంబర్ 30న సౌతాఫ్రికా పై తొలి వన్డే కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి మైదానంలోకి అడుగుపెడితే వారు సచిన్-ద్రవిడ్ రికార్డును అధిగమించి, భారతదేశం తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన నంబర్ 1 జోడీగా చరిత్ర సృష్టించనున్నారు.
వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
ఈ వన్డే సిరీస్‌కు సంబంధించి బీసీసీఐ ఆదివారం (నవంబర్ 23) స్క్వాడ్‌ను ప్రకటించింది. రెగ్యులర్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ అయిన కేఎల్ రాహుల్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. భారత గడ్డపై చాలా రోజుల తర్వాత రోహిత్-కోహ్లీ జోడీని చూడబోతున్నందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా వీరిద్దరూ స్వదేశంలో ఐపీఎల్ టోర్నమెంట్‌లో మాత్రమే కలిసి ఆడారు. రోహిత్-కోహ్లీ జోడీతో పాటు, సచిన్-ద్రవిడ్ (391), ద్రవిడ్-గంగూలీ (369), సచిన్-కుంబ్లే (367), సచిన్-గంగూలీ (341) జోడీలు కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అగ్రశ్రేణి భారత జోడీలలో ఉన్నాయి.
సిరీస్ షెడ్యూల్, స్క్వాడ్ వివరాలు
భారత్, సౌతాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లు రాంచీ, రాయ్‌పూర్, విశాఖపట్నంలో జరగనున్నాయి. మొదటి వన్డే నవంబర్ 30న రాంచీలో, రెండో వన్డే డిసెంబర్ 3న రాయ్‌పూర్‌లో, చివరి వన్డే డిసెంబర్ 6న విశాఖపట్నంలో జరగనుంది.
వన్డే సిరీస్‌కు భారత స్క్వాడ్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ కృష్ణ, ధ్రువ్ జురెల్, అర్ష్‌దీప్ సింగ్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
