Most Runs In WTC : జో రూట్ లెక్క వేరే లెవల్..టెస్టుల్లో 6000+ రన్స్..మరి భారత్ ఆటగాళ్ల పరిస్థితి ఏంటో తెలుసా?
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మొదలైనప్పటి నుంచి టెస్ట్ క్రికెట్‌లో పరుగులు చేసే విధానం మరింత ఆసక్తికరంగా మారింది. క్లిష్టమైన పిచ్‌లు, బలమైన బౌలింగ్‌ను ఎదుర్కొని నిలబడిన దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అగ్రస్థానంలో ఉన్నారు. రూట్ 2019 నుంచి 2025 మధ్య ఆడిన 70 మ్యాచ్‌లలో ఏకంగా 6088 పరుగులు చేసి డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు.

Most Runs In WTC : ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మొదలైనప్పటి నుంచి టెస్ట్ క్రికెట్‌లో పరుగులు చేసే విధానం మరింత ఆసక్తికరంగా మారింది. క్లిష్టమైన పిచ్‌లు, బలమైన బౌలింగ్‌ను ఎదుర్కొని నిలబడిన దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అగ్రస్థానంలో ఉన్నారు. రూట్ 2019 నుంచి 2025 మధ్య ఆడిన 70 మ్యాచ్‌లలో ఏకంగా 6088 పరుగులు చేసి డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు. సుమారు 52 సగటుతో, 21 సెంచరీలు, 22 హాఫ్ శతకాలతో రూట్ అద్భుతమైన ప్రదర్శన చేశారు. 262 పరుగుల అతని అత్యధిక స్కోరు, ఎక్కువ కాలం క్రీజులో నిలబడి ప్రత్యర్థిని అలసిపోయేలా చేసే అతని సామర్థ్యానికి నిదర్శనం.
టాప్ 5లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆధిపత్యం
డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. టాప్ 5 జాబితాలో ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు, ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఉండగా, ఈ జాబితాలో భారత్ నుంచి ఒక్క ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన మొదటి ఐదుగురు ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
జో రూట్ (ఇంగ్లాండ్): రూట్ 2019 నుంచి 2025 మధ్య ఆడిన 70 మ్యాచ్‌లలో 6088 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. 52 సగటు, 21 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలతో పాటు, 262 పరుగుల అత్యధిక స్కోరుతో రూట్ నిలకడకు మారుపేరుగా నిలిచాడు.
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ స్మిత్ 56 మ్యాచ్‌లలో 4297 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. 50 సగటుతో, 13 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలతో, 211 పరుగుల అత్యధిక స్కోరుతో రూట్‌కు గట్టి పోటీ ఇస్తున్నాడు.
మార్నస్ లబుషేన్ (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియాకే చెందిన మార్నస్ లబుషేన్ 4285 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. 48 సగటుతో 98 ఇన్నింగ్స్‌లలో పరుగులు చేసిన లబుషేన్, 215 పరుగుల పెద్ద ఇన్నింగ్స్, 23 హాఫ్ సెంచరీలతో తనేంటో నిరూపించుకున్నాడు.
బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్): ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 3624 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. 105 ఇన్నింగ్స్‌లలో 8 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలతో స్టోక్స్ దూకుడుతో ఆడుతూ మ్యాచ్‌లను మలుపు తిప్పే సామర్థ్యాన్ని ప్రదర్శించాడు.
ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ 3444 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. 73 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయడం ఇతని ప్రత్యేకత. ఇతని దూకుడుతో కూడిన బ్యాటింగ్ ఆస్ట్రేలియాకు అనేక మ్యాచ్‌లలో బలం చేకూర్చింది.
భారత ఆటగాళ్ల పరిస్థితి ఏంటి?
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 జాబితాలో భారత ఆటగాళ్లు ఎవరూ లేకపోవడం భారత అభిమానులకు ఆశ్చర్యం కలిగించే అంశం. టెస్ట్ క్రికెట్‌లో భారత్ బలంగా ఉన్నప్పటికీ, ఆటగాళ్లు నిలకడగా ఎక్కువ పరుగులు చేయడంలో ఆసీస్, ఇంగ్లండ్ ఆటగాళ్ల కంటే కాస్త వెనుకబడి ఉన్నారు. భారత బ్యాట్స్‌మెన్‌లు తమ స్థానాలను మెరుగుపరుచుకొని, భవిష్యత్తులో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
