IND Vs AUS: గిల్, బుమ్రా కాదు హిట్‌మ్యాన్‌కు వారసుడు అతడే.! టెస్టుల్లో నెక్స్ట్ కెప్టెన్ ఎవరంటే

కివీస్ చేతిలో టీమిండియా ఘోర ఓడిపోయింది. వచ్చేది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. అది గెలిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్‌లోకి టీమిండియా వెళ్ళేది. మరి ఇలాంటి తరుణంలో బీసీసీఐ కీలక చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది.

IND Vs AUS: గిల్, బుమ్రా కాదు హిట్‌మ్యాన్‌కు వారసుడు అతడే.! టెస్టుల్లో నెక్స్ట్ కెప్టెన్ ఎవరంటే
Ind Vs Nz
Follow us

|

Updated on: Nov 05, 2024 | 2:18 PM

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా ఘోర వైఫల్యం చెందింది. దీంతో ఆ జట్టు సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనపై వరుసగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కంగారూలతో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు భారత్ ఈ నెలాఖరులో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో కూడా సీనియర్ ఆటగాళ్లు రాణించకపోతే బీసీసీఐ వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మెషిన్ విరాట్ కోహ్లీలపై వేటు వేసే ప్రమాదం పొంచి ఉంది. మరి రోహిత్ శర్మ జట్టుకు దూరమైతే, తదుపరి టీమిండియా టెస్టు కెప్టెన్‌ ఎవరన్నది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఇదిలా ఉంటే, భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ టెస్టు జట్టుకు సరైన కెప్టెన్ ఎవరా అని చెప్పేశాడు.

ఇది చదవండి: పత్తి చేనులో కలుపు తీస్తుండగా.. బాబోయ్.! కనిపించింది చూసి గుండె గుభేల్

రేసులో ఉన్న ఏకైక ఆటగాడు పంత్..

రోహిత్ శర్మ తర్వాత భారత టెస్టు కెప్టెన్‌గా రిషబ్ పంత్ సరైనవాడని మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత జట్టులో కెప్టెన్సీ రేసులో ఉన్న ఏకైక ఆటగాడు పంత్ అని అన్నాడు. ‘ రిషబ్ పంత్ టెస్ట్ కెప్టెన్సీకి అర్హుడు. ప్రస్తుత జట్టులో అతడొక్కడే రేసులో ఉన్నాడు. అతడు ఆడిన ప్రతిసారీ భారత జట్టును విజయపథంలో నడిపించాడు. ఏ ఆర్డర్‌లో ఆడినా మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లేదా దక్షిణాఫ్రికా ఏదైనా సరే, అతను పర్ఫెక్ట్’ అని కైఫ్ చెప్పాడు.

ఇవి కూడా చదవండి

రిషబ్ పంత్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు, అతను లెజెండ్‌గా రిటైర్ అవుతాడు. తన కీపింగ్ చాలా మెరుగుపడింది. అతను క్రీజులో ఉన్నంతసేపు న్యూజిలాండ్ జట్టు ఓటమి అంచునకు వెళ్లింది. కాబట్టి ప్రస్తుత ఆటగాళ్లలో, మీరు భవిష్యత్ కెప్టెన్ కోసం చూస్తున్నట్లయితే, రోహిత్ శర్మ వారసుడిగా రిషబ్ పంత్ అర్హుడని కైఫ్ స్పష్టం చేశాడు.

ఇది చదవండి: పోలీసుల తనిఖీల్లో తేడాగా కనిపించిన యువకుడు.. బ్యాగ్ చెక్ చేయగా.. వామ్మో

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే