Virat Kohli Birthday: కింగ్ కోహ్లీకి బర్త్‌డే శుభాకాంక్షలు.. ఓ డిమాండ్‌తో ట్విస్ట్ ఇచ్చిన యూవీ

Happy Birthday Virat Kohli: విరాట్ కోహ్లీ 36వ పుట్టినరోజు సందర్భంగా యువరాజ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంలో ఓ డిమాండ్ కూడా చేశాడు. అలాగే, కింగ్ కోహ్లీకి పలువురు మాజీలు కూడా శుభాకాంక్షలు తెలిపారు.

Virat Kohli Birthday: కింగ్ కోహ్లీకి బర్త్‌డే శుభాకాంక్షలు.. ఓ డిమాండ్‌తో ట్విస్ట్ ఇచ్చిన యూవీ
Virat Kohli Birthday
Follow us
Venkata Chari

|

Updated on: Nov 05, 2024 | 2:36 PM

Happy Birthday Virat Kohli: నేడు విరాట్ కోహ్లీ తన 36వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అయితే, ఈ సందర్భంగా విరాట్ కోహ్లీని యువరాజ్ సింగ్ ఓ కోరిక కోరాడు. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆ విషయాన్ని అందరి తరపున యువరాజ్ కోరాడు. విరాట్ 36వ పుట్టినరోజు సందర్భంగా యువరాజ్ డిమాండ్ చేసిన ప్రత్యేకత ఏమిటంటే అతని ఫామ్, భారీ ఇన్నింగ్స్. అవును, యువరాజ్ సింగ్ తన పుట్టినరోజు శుభాకాంక్షల సందేశంలో విరాట్ కోహ్లి నుంచి ఇదే విషయాన్ని డిమాండ్ చేశాడు.

శుభాకాంక్షలు తెలిపిన యువరాజ్..

సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా పోస్ట్ చేస్తూ.. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, కింగ్ కోహ్లీ. నిరాశ తర్వాతనే ఆశ పుడుతుంది. ప్రపంచం మొత్తం మీ వైపు అదే ఆశతో చూస్తోంది. మీరు ఇంతకు ముందు కూడా అలాంటి అంచనాలకు అనుగుణంగా రాణించారు. ఈసారి కూడా అలాగే చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

యువరాజ్ సింగ్ తన అభినందన సందేశంలో నేరుగా ఏమీ రాయనప్పటికీ, విరాట్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చి పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల నిరీక్షణకు ముగింపు పలకాలని అతని మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

యువరాజ్‌తో పాటు ఇతర క్రికెటర్లు కూడా శుభాకాంక్షలు తెలిపారు. అయితే యువరాజ్ సింగ్‌తోపాటు చాలామంది క్రికెటర్లు విరాట్ కోహ్లీకి 36వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా ఆటగాళ్లతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు కూడా అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

పాత రోజులను గుర్తుచేసుకుంటూ, ఆకాష్ చోప్రా ఆ రోజునే ఈ అబ్బాయి ఏదైనా భిన్నంగా చేస్తాడని అనిపించింది. చికు నుంచి GOAT వరకు అంటూ స్పెషల్‌గా విసెష్ తెలిపాడు. మీ వైఖరి భారతదేశంలో క్రికెట్ ఆడే శైలిని మార్చింది. సురేశ్ రైనా కూడా విరాట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ విరాట్‌కు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.

న్యూజిలాండ్‌పై క్లీన్ స్వీప్‌తో సిరీస్ కోల్పోయిన భారత్.. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతోంది. తన 36వ పుట్టినరోజును తన భార్య అనుష్కతో కలిసి ఇండియాలో సెలబ్రేట్ చేసుకున్నట్లు సమాచారం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి