టీమిండియా వద్దంది.. విదేశీ జట్టు రారమ్మంది.. కట్ చేస్తే 32 సిక్స్‌లు, 17 ఫోర్లతో శివతాండవం.. అసలెవరీ ప్లేయర్?

భారత్‌ను విడిచిపెట్టిన ఓ బ్యాట్స్‌మెన్ ఓమన్ జట్టులో చేరాడు. తాజాగా తన పవర్ ఫుల్ హిట్టింగ్‌తో భారీ సిక్స్‌లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇటీవల జరిగిన హాంకాంగ్ ఇంటర్నేషనల్ సిక్స్ టోర్నమెంట్‌లో ఈ ఆటగాడు అత్యధికంగా 32 సిక్సర్లు కొట్టి, అందిరికి షాక్ ఇచ్చాడు. ఈ ఆటగాడు ఎవరో తెలుసా?

టీమిండియా వద్దంది.. విదేశీ జట్టు రారమ్మంది.. కట్ చేస్తే 32 సిక్స్‌లు, 17 ఫోర్లతో శివతాండవం.. అసలెవరీ ప్లేయర్?
Vinayak Shukla
Follow us

|

Updated on: Nov 05, 2024 | 3:20 PM

రోహిత్ శర్మ హిట్‌మ్యాన్‌గా పేరు తెచ్చుకోవడానికి కారణం అతని భారీ సిక్సర్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, అతని రీసెంట్ ఫామ్ చాలా దారుణంగా పడిపోయింది. సిక్సర్లు కొట్టడంలోనే కాదు.. క్రీజులో నిలవడం కూడా అతనికి కష్టంగా మారింది. రోహిత్ శర్మ వైఫల్యం మధ్య, తన తుఫాను హిట్టింగ్‌తో విధ్వంసం సృష్టించిన ఒక భారతీయ క్రికెటర్ సంచలనంగా మారాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ భారత క్రికెటర్ ఇప్పుడు భారత్‌ను వదిలి ఓమన్‌కు ఆడుతున్నాడు. ఈ ఆటగాడు తన ప్రాణాంతక బ్యాటింగ్‌తో టీమ్ ఇండియాకు చాలా నష్టం కలిగించాడు. హాంకాంగ్ ఇంటర్నేషనల్ సిక్స్‌లలో అత్యధిక సిక్సర్లు కొట్టి, అత్యధిక పరుగులు చేసిన రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ వినాయక్ శుక్లా గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం.

వినాయక్ శుక్లా విధ్వంసం..

క్రికెట్ అభిమానులకు వినాయక్ శుక్లా పేరు తెలియదు, కానీ, ఇప్పుడు ఈ ఆటగాడు తన తుఫాను బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచి, సంచలనంగా మారాడు. వినాయక్ శుక్లా హాంకాంగ్ ఇంటర్నేషనల్ సిక్స్ టోర్నమెంట్‌లో ఆడిన 6 ఇన్నింగ్స్‌ల్లో అత్యధికంగా 275 పరుగులు చేశాడు. ఈ 275 పరుగులు కేవలం 73 బంతుల్లోనే నమోదు కావడం పెద్ద విషయం. శుక్లా సగటు 137.50గా నమోదైంది. అతను 4 మ్యాచ్‌ల్లో అర్ధ సెంచరీలు సాధించాడు. టోర్నమెంట్‌లో అత్యధికంగా 32 సిక్సర్లు, 17 ఫోర్లు కొట్టాడు. వినాయక్ శుక్లా బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 376.71గా నిలిచింది.

టీమ్ ఇండియాను కూడా వదలని వినాయక్ శుక్లా..

View this post on Instagram

A post shared by Vinayak Shukla (@iv_nayak)

వినాయక్ శుక్లా నవంబర్ 3న టీమిండియాపై తన పవర్ ఫుల్ బ్యాటింగ్ చూపించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ భారత జట్టుపై కేవలం 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఈ ఆటగాడు ప్రతి బంతికి ఫోర్ లేదా సిక్స్ కొడుతూ బౌలర్లపై దాడి చేశాడు. శుక్లా తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. అతని స్ట్రైక్ రేట్ 490.90గా నిలిచింది. వినాయక్ ఇన్నింగ్స్ ఆధారంగానే ఓమన్ జట్టు టీమిండియాను సులభంగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 ఓవర్లలో 119 పరుగులు చేసింది. కానీ, వినాయక్‌ బ్యాటింగ్‌తో ఓమన్‌ కేవలం 4.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.

వినయ్ శుక్లా సూపర్బ్ ఇన్నింగ్స్..

వినయ్ శుక్లాకు అద్భుతమైన ప్రతిభ ఉంది. అతను సిక్సర్లు కొట్టే విభిన్నమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. వినయ్ శుక్లా అద్భుతమైన టైమింగ్‌తో పాటు భారీ సిక్స్‌లు కొట్టే సామర్థ్యం కలిగి ఉన్నాడు. స్పిన్నర్లతోపాటు ఫాస్ట్ బౌలర్లలను కూడా అవలీలగా ఆడేస్తున్నాడు. ఈ ఆటగాడు భారత్‌లో ఏ స్థాయిలోనూ ఆడలేకపోవడం చాలా ఆశ్చర్యకరం. అయితే, ఇప్పుడు హాంకాంగ్ ఇంటర్నేషనల్ సిక్స్‌లో వినయ్ శుక్లా ప్రతిభ వెలుగులోకి రావడంతో.. ఫ్యాన్స్ అంతా టీమిండియాకు నీ లాంటి ఆటగాడే కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే