10 బంతుల్లో 6 సిక్సర్లు.. 56 బంతుల్లో 91 రన్స్..162కు పైగా స్ట్రైక్‌రేట్‌తో పాక్‌కు హెచ్చరికలు పంపిన ప్లేయర్
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. రిచా ఘోష్ 56 బంతుల్లో 91 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్ లో ఏకంగా 9 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. కాగా తాను ఆడిన చివరి 10 బంతుల్లో రిచా ఏకంగా 6 సిక్సర్లు కొట్టడం విశేషం.
అండర్-19 మహిళల జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇప్పుడు సీనియర్ జట్టు వంతు వచ్చింది. శుక్రవారం (ఫిబ్రవరి 10) నుంచి మహిళల T20 ప్రపంచకప్ దక్షిణాఫ్రికా వేదికగా ప్రారంభమవుతుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలని ధీమాగా ఉంది. కాగా టోర్నీ ప్రారంభానికి ముందు టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. కాగా ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విఫలమైన టీమిండియా రెండో మ్యాచ్‌లో రెచ్చిపోయింది. ముఖ్యంగా అండర్-19 ప్రపంచ ఛాంపియన్ జట్టులో భాగమైన 19 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిచా ఘోష్ సిక్సర్ల వర్షం కురిపించి క్రికెట్ అభిమానుల మనసు గెల్చుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. రిచా ఘోష్ 56 బంతుల్లో 91 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్ లో ఏకంగా 9 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. కాగా తాను ఆడిన చివరి 10 బంతుల్లో రిచా ఏకంగా 6 సిక్సర్లు కొట్టడం విశేషం. 6,1,6,6,1,6,1,6,6,1.. ఇలా సాగింది రిచా విజృంభణ. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా 52 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.
నేరుగా పాక్ తోనే ఇక..
కాగా ప్రపంచకప్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ప్రతి జట్టు 2 ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడవలసి ఉంది. ఇందులో టీం ఇండియా మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ వంటి సీనియర్ బ్యాటర్లు బ్యాటింగ్‌కు దిగలేదు. బదులుగా, యువ ప్లేయర్లు, బ్యాకప్ ప్లేయర్‌లకు అవకాశం కల్పించారు. అయితే పవర్ ప్లేలో 35 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది భారత్. ఆ తర్వాత రిచా ఘోష్ విజృంభణ ప్రారంభమైంది. రిచాతో పాటు జెమీమా రోడ్రిగ్స్ కూడా 27 బంతుల్లో 41 పరుగులు చేసింది. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు ఏకంగా 92 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టు స్కోరును ఐదు వికెట్ల నష్టానికి 183కు చేర్చారు. పూజా వస్త్రాకర్ నాలుగు బంతుల్లో రెండు సిక్సర్లతో అజేయంగా 13 పరుగులు చేసింది. దీంతో భారత్ 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను 131 పరుగులకే కట్టడి చేసి 52 పరుగుల తేడాతో సాధించారు. భారత్ తరఫున దేవికా వైద్య (2/21) అత్యధిక వికెట్లు తీయగా, రాజేశ్వరి గైక్వాడ్, అంజలి సర్వాణి, దీప్తి శర్మ, రాధా యాదవ్, షెఫాలీ వర్మ ఒక్కో వికెట్ తీశారు. కాగా ప్రపంచకప్ టోర్నీలో భాగంగా భారత జట్టు ఆదివారం ( ఫిబ్రవరి 12) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.
Icc women’s t20 world cup 2023, warm up match – ?? vs ??
India won the match by 52 runs#CricketTwitter #T20WorldCup pic.twitter.com/ILRkaxAQDd
— WomensCricCraze? #T20WORLDCUP (@WomensCricCraze) February 8, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..