IPL 2024: గాయం నుంచి మ్యాక్స్‌వెల్ కోలుకున్నాడా? హైదరాబాద్‌తో మ్యాచ్ ఆడతాడా? క్లారిటీ ఇదిగో
ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆర్‌సీబీ సోమవారం (ఏప్రిల్ 15) బలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడుతోంది. ఈ మ్యాచ్ ఆర్‌సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. అందుకే వరుసగా 4 ఓటములతో డీలా పడినఆర్సీబీ ఈరోజు మ్యాచ్ లో గెలిచి మళ్లీ గెలుపు బాట పడుతుందని

ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆర్‌సీబీ సోమవారం (ఏప్రిల్ 15) బలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడుతోంది. ఈ మ్యాచ్ ఆర్‌సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. అందుకే వరుసగా 4 ఓటములతో డీలా పడినఆర్సీబీ ఈరోజు మ్యాచ్ లో గెలిచి మళ్లీ గెలుపు బాట పడుతుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బొటన వేలికి గాయమైన ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ అందుబాటులో ఉంటాడా?లేదా? అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. ముంబయితో మ్యాచ్‌లో గాయపడిన మ్యాక్స్‌వెల్‌ను స్కానింగ్ చేశారు. ఆ తర్వాత వచ్చే కొన్ని మ్యాచ్‌లకు ఈ స్టార్ అల్ రౌండర్ అందుబాటులో ఉండడని వార్తలు వచ్చాయి. అయితే ఇంతలో టీమ్ డైరెక్టర్ మో బోబాట్ మ్యాక్సీ గాయంపై కీలక అప్డేట్ ఇచ్చారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన RCB జట్టు డైరెక్టర్ మో బోబాట్, గాయం తర్వాత మాక్స్‌వెల్ రెండు స్కాన్‌లకు వెళ్లాడన్నారు. స్కానింగ్ రిపోర్టులో మ్యాక్స్‌వెల్ గాయం తీవ్రంగా లేదని తెలిసిందన్నారు. కాబట్టి, గాయం ఆందోళన లేకపోవడంతో మ్యాక్స్‌వెల్ ఈరోజు ప్రాక్టీస్ చేస్తాడన్నారు. అంటే నేటి మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ బరిలోకి దిగే అవకాశం ఉందని మో బోబాట్ ప్రకటన ద్వారా స్పష్టమవుతోంది. అయితే పేలవమైన ఫామ్‌తో ససతమతమవుతోన్న మ్యాక్సీ ఈ మ్యాచ్ నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సీజన్ ప్రారంభం నుంచి మ్యాక్స్‌వెల్ పేలవ ఫామ్‌తో బాధపడుతున్నాడు. మ్యాక్స్‌వెల్ ఇప్పటివరకు ఆడిన ఆరు ఇన్నింగ్స్‌లలో కేవలం 5.33 సగటుతో 32 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు డకౌట్లు కూడా ఉన్నాయి. అందువల్ల నేటి మ్యాచ్‌లో అతని స్థానంలో కెమెరూన్ గ్రీన్‌కు అవకాశం దక్కే అవకాశం ఉంది.
ప్రాక్టీస్ లో ఆర్సీబీ ప్లేయర్లు..
Royal Challenge Packaged Drinking Water Moment of the Day 📸
Getting sharper and better, the masterminds are working their magic 🪄#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #Choosebold pic.twitter.com/1eZUWNRecI
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 15, 2024
RCB ప్రాబబుల్ స్క్వాడ్:
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్వెస్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్/కెమెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, రీస్ టాప్లీ, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, సౌరవ్ చౌహాన్ .
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








