ఆ పిచ్చోడ్ని జట్టు నుంచి పీకేయకపోతే.. రాసిపెట్టుకోండి.! RCB ప్లేఆఫ్స్‌కు వెళ్లడం కష్టమే..
ఎకనా స్టేడియంలో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయింది. కీలక సమయంలో రొమారియో షెఫర్డ్ బ్యాటింగ్‌లో విఫలం కావడంతో ఆర్సీబీ ప్లేఆఫ్ అవకాశాలు కష్టమయ్యాయి. దీంతో షెఫర్డ్‌పై అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ మళ్ళీ మొదటికే వచ్చింది. గెలవాల్సిన మ్యాచ్‌లో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకోవడం ఆ జట్టుకు అలవాటుగా మారింది. తాజాగా ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన హై-వోల్టేజ్ పోరులో ఆర్సీబీ 9 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి కేవలం ఒక మ్యాచ్ ఫలితం మాత్రమే కాదు, ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలను కూడా క్లిష్ట స్థితిలోకి నెట్టేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహం అంతా విండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెఫర్డ్‌పైనే కనిపిస్తోంది. మ్యాచ్ ఒక దశలో ఆర్సీబీ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపించింది. 16వ ఓవర్లో టిమ్ డేవిడ్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన రొమారియో షెఫర్డ్, రాగానే వరుసగా రెండు ఫోర్లు బాదాడు. దాంతో “షెఫర్డ్ ఆన్ ఫైర్.. ఇక ఆర్సీబీ గెలిచినట్టే” అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. చివరి మూడు ఓవర్లలో 47 పరుగులు చేయాల్సి ఉండగా.. షెఫర్డ్ తడబడ్డాడు.
ఇది చదవండి: వరల్డ్‌కప్‌లో 3 సెంచరీలు.. 22 సిక్సర్లతో 333 పరుగులు.. ఇప్పుడు రోహిత్ వారుసుడిగా టీమిండియాలోకి రీఎంట్రీ
ముఖ్యంగా 19వ ఓవర్లో 20 పరుగులు కావాల్సి ఉండగా స్ట్రైకింగ్‌లో ఉన్న షెఫర్డ్ ఆ ఓవర్లో కేవలం 10 పరుగులే రాబట్టగలిగాడు. భారీ హిట్టింగ్ చేయడంలో విఫలమైన అతను 15 బంతుల్లో కేవలం 23 పరుగులు మాత్రమే చేశాడు. కీలక సమయంలో కనీసం ఎదుటి ఎండ్‌లో ఉన్న కృనాల్ పాండ్యాకు స్ట్రైకింగ్ ఇచ్చి ఉన్నా ఫలితం మరోలా ఉండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కేవలం ఈ ఒక్క మ్యాచ్ మాత్రమే కాదు, ఈ సీజన్ అంతా షెఫర్డ్ ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. ఒకసారి ఆయన గణాంకాలు గమనిస్తే.. 10 మ్యాచ్‌ల్లో 50 బంతులు ఎదుర్కొని కేవలం 79 పరుగులు మాత్రమే చేశాడు. అంటే స్ట్రైక్ రేట్ ఆల్ రౌండర్ హోదాకు ఏమాత్రం తగదు. బౌలింగ్ విషయానికొస్తే.. 17 ఓవర్లలో ఏకంగా 220 పరుగులు సమర్పించుకున్నాడు. ఎకానమీ రేట్ 12.94గా ఉందంటే ప్రత్యర్థి బ్యాటర్లు అతడిని ఏ రేంజ్‌లో టార్గెట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. వికెట్లు తీసింది కేవలం ఐదు మాత్రమే.
షెఫర్డ్ ప్రదర్శనపై ఆర్సీబీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. “అటు బౌలింగ్‌లో పరుగులు ఇస్తాడు.. ఇటు బ్యాటింగ్‌లో బంతులు వృథా చేస్తాడు.. ఇతనికి జట్టులో చోటు ఎలా ఇస్తారు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తక్షణమే అతడిని తప్పించి తుది జట్టులో మార్పులు చేయాలని మేనేజ్‌మెంట్‌ను డిమాండ్ చేస్తున్నారు.
ఇది చదవండి: SRH గెలుపుపై ఏడుస్తున్న ఆ రెండు జట్లు.! ఇకపై అన్ని మ్యాచ్‌లు గెలిస్తేనే ప్లేఆఫ్స్‌కు..
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి




