AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: అసలైన RCB విశ్వరూపం ఇది.! రాసిపెట్టుకోండి.. ఇలా జరిగితే కప్పు కొట్టేస్తారు..

గత సీజన్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదే ఊపును ఈ ఏడాది కూడా కొనసాగిస్తోంది. పాయింట్ల పట్టికలో టాప్ 2లో దూసుకుపోతున్న ఆర్సీబీ, మళ్ళీ కప్పు కొట్టడం ఖాయమనిపిస్తోంది. విరాట్ కోహ్లీ ఫామ్ నుంచి చిన్నస్వామి స్టేడియం అడ్వాంటేజ్ వరకు..

IPL 2026: అసలైన RCB విశ్వరూపం ఇది.! రాసిపెట్టుకోండి.. ఇలా జరిగితే కప్పు కొట్టేస్తారు..
Rcb Ipl 2026
Ravi Kiran
|

Updated on: May 06, 2026 | 8:58 AM

Share

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే కేవలం ఒక జట్టు కాదు, అదొక ఎమోషన్. గత సీజన్‌లో దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ కప్పు గెలిచిన ఆర్సీబీ, ఈసారి కూడా అదే బాటలో పయనిస్తోంది. ప్రస్తుతం 9 మ్యాచ్‌లలో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఆటగాళ్లలో పెరిగిన ఆత్మవిశ్వాసం, జట్టులోని సమతుల్యత చూస్తుంటే “ఈసారి కూడా కప్పు మనదే” అని అభిమానులు ధీమాగా చెబుతున్నారు. ఆర్సీబీ మళ్ళీ టైటిల్ గెలవడానికి ఉన్న ఆ ఐదు బలమైన కారణాలను ఇప్పుడు చూద్దాం.

మొదటి కారణం.. జట్టులో ఉన్న స్థిరత్వం. గత ఏడాది ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ కాంబినేషన్‌ను ఈసారి కూడా దాదాపు అలాగే కొనసాగిస్తున్నారు. ఆటగాళ్ల మధ్య ఉన్న అద్భుతమైన అవగాహన మైదానంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రెండోది, ఆటగాళ్ల ఫామ్, మొమెంటం. విరాట్ కోహ్లీ, పడిక్కల్ లాంటి బ్యాటర్లు పరుగుల వరద పారిస్తుంటే, బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్(17 వికెట్లు), కృనాల్ పాండ్యా (9 వికెట్లు) ప్రత్యర్థులను వణికిస్తున్నారు. జట్టులోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నారు.

మూడోది, ఆర్సీబీ అవలంబిస్తున్న సాహసోపేతమైన ఆటతీరు. కేవలం డిఫెన్సివ్‌గా ఆడకుండా, మొదటి ఓవర్ నుంచే అటాకింగ్ అప్రోచ్‌తో వెళ్తున్నారు. సన్‌రైజర్స్ ఇచ్చిన 203 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16 ఓవర్లలోనే ఊడ్చేయడం వారి దూకుడుకు నిదర్శనం. నాలుగో కారణం, టాప్ 2లో నిలిచే అవకాశం. లీగ్ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిస్తే ప్లేఆఫ్స్‌లో అదనపు అవకాశం ఉంటుంది. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఆర్సీబీ టాప్ 2లో ముగించడం ఖాయంగా కనిపిస్తోంది. చివరిగా అత్యంత ముఖ్యమైనది హోమ్ అడ్వాంటేజ్. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియంలో జరిగే అవకాశాలు ఉండటంతో, ఆర్సీబీకి ఇది కొండంత బలం. సొంత గడ్డపై అభిమానుల కేరింతల మధ్య ఆర్సీబీని ఆపడం ఏ జట్టుకైనా దాదాపు అసాధ్యం. ఈ ఐదు కారణాలు తోడైతే, ఆర్సీబీ తన క్యాబినెట్‌లో రెండో ఐపీఎల్ ట్రోఫీని చేర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

Follow Us