RCB Playing XI: బెంగళూరు ప్లేయింగ్‌ 11లోకి ఊర మాస్ ప్లేయర్స్ ఎంట్రీ.. ‘ఈ సాలా కప్ నమదే’ అంటోన్న ఫ్యాన్స్..

IPL 2023 Auction: వేలం కోసం RCB వద్ద రూ. 10 కోట్ల కంటే తక్కువ ఉంది. అయితే, డబ్బును చాలా ఆలోచనాత్మకంగా ఖర్చు చేశారు.

RCB Playing XI: బెంగళూరు ప్లేయింగ్‌ 11లోకి ఊర మాస్ ప్లేయర్స్ ఎంట్రీ.. 'ఈ సాలా కప్ నమదే' అంటోన్న ఫ్యాన్స్..
Royal Challengers Bangalore Playing 11
Follow us

|

Updated on: Dec 24, 2022 | 9:28 AM

Royal Challengers Bangalore Playing XI: 16వ సీజన్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుతమైన వ్యూహాన్ని ప్రదర్శించి, ఏడుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దీంతె 25 మంది కోటాను పూర్తి చేసుకుంది. వేలంలో మొత్తం రూ.7 కోట్లు వెచ్చించగా, ఇంకా రూ.1.75 కోట్లు ఆర్‌సీబీ పర్సులో మిగిలి ఉన్నాయి.

వేలం కోసం బెంగళూర్ వద్ద రూ. 10 కోట్ల కంటే తక్కువ ఉన్నాయి. అయితే, తమ డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేయడంలో సక్సెస్ అయ్యారు. జట్టు విల్ జాక్వెస్‌పై పూర్తి దృష్టి పెట్టింది. అతనిని కొనుగోలు చేయడంలోనూ విజయం సాధించింది. ఈ వేలంలో RCBకి అత్యంత ఖరీదైన ఆటగాడిగా జాక్వెస్ నిలిచాడు. దీంతో బెంగళూరు ప్లేయింగ్ 11పై ఓ పూర్తి అవగాహన వచ్చేసింది.

ఇవి కూడా చదవండి

ఆర్‌సీబీ కొనుగోలు చేసిన ఆటగాళ్లు: సోను యాదవ్ (రూ.20 లక్షలు), అవినాష్ సింగ్ (రూ.60 లక్షలు), రాజన్ కుమార్ (రూ.70 లక్షలు), మనోజ్ భాండాగే (రూ.20 లక్షలు), విల్ జాక్వెస్ (రూ.3.2 కోట్లు), హిమాన్షు శర్మ (రూ.20 లక్షలు), రీస్ టాప్లీ (రూ.1.9 కోట్లు).

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూర్తి జట్టు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ , మహిపాల్ లోమ్రోర్, మహమ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్ధార్థ్ కౌల్, ఆకాష్ దీప్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్, రాజన్ కుమార్, మనోజ్ భాండాగే, విల్ జాక్స్, హిమాన్షు శర్మ, రీస్ టాప్లీ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యుత్తమ ప్లేయింగ్ XI ఇలా ఉండొచ్చు..

కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఓపెనింగ్‌లో బరిలోకి దిగనున్నాడు. ఫిన్ అలెన్‌కు అతనికి మద్దతు ఇచ్చే అవకాశం ఇవ్వవచ్చు. విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్‌లను కూడా ఆడించాలని నిర్ణయించారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా దినేష్ కార్తీక్, ఆల్ రౌండర్‌గా షాబాజ్ అహ్మద్ ఆడనున్నారు. జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్ జట్టు ప్రధాన బౌలర్లుగా బరిలోకి దిగనున్నారు.

ఆర్‌సీబీ ప్రాబబుల్ ప్లేయింగ్ XI – ఫాఫ్ డుప్లెసిస్, అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, సిద్ధార్థ్ కౌల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు