జడేజా.. నువ్వు కేక అంతే
సెమీస్‌లో భాగంగా మంగళవారం భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కివీస్ ఆటగాడు నికోలస్‌ను తన బౌలింగ్‌తో క్లీన్‌బౌల్ట్ చేసి సూపర్ అనిపించాడు లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా. ఇక ఈ మ్యాచ్‌లో జడేజా మరో ఘనతను సాధించాడు. సాధారణంగా ఒక ఓవర్ వేసేందుకు ఫాస్ట్ బౌలర్లు 4-5 నిమిషాలు.. స్పిన్నర్లు 3నిమిషాలు తీసుకుంటున్నారు. ఇక జడేజా కూడా 2 నుంచి రెండున్నర నిమిషాల్లో తన ఓవర్ పూర్తి చేస్తుంటాడు. అయితే నిన్న జరిగిన సెమీస్ మ్యాచ్‌లో […]
సెమీస్‌లో భాగంగా మంగళవారం భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కివీస్ ఆటగాడు నికోలస్‌ను తన బౌలింగ్‌తో క్లీన్‌బౌల్ట్ చేసి సూపర్ అనిపించాడు లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా. ఇక ఈ మ్యాచ్‌లో జడేజా మరో ఘనతను సాధించాడు. సాధారణంగా ఒక ఓవర్ వేసేందుకు ఫాస్ట్ బౌలర్లు 4-5 నిమిషాలు.. స్పిన్నర్లు 3నిమిషాలు తీసుకుంటున్నారు. ఇక జడేజా కూడా 2 నుంచి రెండున్నర నిమిషాల్లో తన ఓవర్ పూర్తి చేస్తుంటాడు. అయితే నిన్న జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఒక నిమిషం 31 సెకన్లలోనే ఒక ఓవర్ పూర్తి చేశాడు జడేజా. వన్డే మ్యాచ్‌లో ఇంత తక్కువ వ్యవధిలో బౌలర్ ఓవర్ పూర్తి చేయడం చాలా అరుదైన సంఘటనే.