‘వర్షం’ రావడం టీమిండియాకు లాభమా..? నష్టమా..!

మంగళవారం జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో కివీస్‌కు చెమటలు పట్టించారు టీమిండియా ఆటగాళ్లు. మొదటి ఒక్క పరుగు తేడాతోనే టీమిండియా ఒక వికెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. షార్ట్‌లు కొట్టే న్యూజిలాండ్‌ను కట్టడి చేసేందుకు టీమిండియా బౌలర్లు గట్టిగానే కృష్టి చేశారు. కాగా.. మాంచెస్టర్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకంగా మారాడు. దీంతో.. నిన్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 46.1 ఓవర్ల దగ్గరే మ్యాచ్ నిలిచిపోయింది. రిజర్వ్ డేలో భాగంగా  నిన్నటి […]

'వర్షం' రావడం టీమిండియాకు లాభమా..? నష్టమా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 10, 2019 | 10:00 AM

మంగళవారం జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో కివీస్‌కు చెమటలు పట్టించారు టీమిండియా ఆటగాళ్లు. మొదటి ఒక్క పరుగు తేడాతోనే టీమిండియా ఒక వికెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. షార్ట్‌లు కొట్టే న్యూజిలాండ్‌ను కట్టడి చేసేందుకు టీమిండియా బౌలర్లు గట్టిగానే కృష్టి చేశారు.

కాగా.. మాంచెస్టర్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకంగా మారాడు. దీంతో.. నిన్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 46.1 ఓవర్ల దగ్గరే మ్యాచ్ నిలిచిపోయింది. రిజర్వ్ డేలో భాగంగా  నిన్నటి మ్యాచ్ నేడు మళ్లీ కొనసాగనుంది. అయితే.. నిన్న వర్షం కారణంగా టీమిండియాకు మేలు అని కొందరు అంటుంటే.. కాదు కాదని మరికొందరు అంటున్నారు.

వర్షం కారణంగా ఇరు జట్లకు కొంత విశ్రాంతి దొరికింది. ఈ విశ్రాంతి కారణంగా న్యూజిలాండ్‌ మళ్లీ విజృభించే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు వద్ద మ్యాచ్ ఆగిపోయింది. 46.1 ఓవటర్లు అంటే న్యూజిలాండ్‌కు ఇంకా 23 బాల్స్ ఉన్నాయి. న్యూజిలాండ్ గనుక గట్టి షార్టులిచ్చి.. కొట్టినా న్యూజిలాండ్ స్కోర్ దగ్గర దగ్గరగా 260 లేదా 270 వరకూ వెళ్లవచ్చు. లేకపోతే టీమిండియా బౌలర్లు ధాటికి కుప్పకూలిపోతారో అన్నది చూడాలి.

అలాగే.. టీమిండియాకు కూడా విశ్రాంతి దొరికింది కాబట్టి వాళ్ళు మరిన్ని ప్లాన్స్ వేసుకునే ఛాన్స్‌ఉందని నిపుణులు అనుకుంటున్నారు. టిమిండియా నిన్న ఉన్న ఫామ్‌లో గనుక ఉంటే న్యూజిలాండ్ స్కోర్‌ను ఈజీగా క్రాస్ చేయొచ్చని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ.. కొహ్లీ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో.. ‘న్యూజిలాండ్‌ టీంలో మంచి బౌలర్లు ఉన్నారని.. అయినా తట్టుకొని నిలుస్తామని’ అన్నాడు. చూడాలి మరి వరుణుడు టీమిండియాకు కలిసివస్తాడో.. లేడో..!