చెలరేగిన టీమిండియా బౌలర్లు.. న్యూజిలాండ్‌కు చెమటలు.

మాంచెస్టర్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకంగా మారాడు. దీంతో నిన్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 46.1 ఓవర్ల దగ్గరే మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం దెబ్బతో నిన్నటి మ్యాచ్ నేడు మళ్లీ కొనసాగనుంది. వర్షం తగ్గినా పిచ్‌పై తేమ కారణంగా నిన్న మ్యాచ్ కొనసాగే అవకాశాలు లేకుండాపోయాయి. అయితే సెమీస్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండటంతో ఇవాళ మ్యాచ్ మళ్లీ జరగనుంది. 46.1 ఓవర్ల నుంచి మ్యాచ్ మళ్లీ మొదలవుతుంది. అంతకుముందు మొదట బ్యాటింగ్‌కు […]

చెలరేగిన టీమిండియా బౌలర్లు.. న్యూజిలాండ్‌కు చెమటలు.
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 10, 2019 | 4:52 PM

మాంచెస్టర్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకంగా మారాడు. దీంతో నిన్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 46.1 ఓవర్ల దగ్గరే మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం దెబ్బతో నిన్నటి మ్యాచ్ నేడు మళ్లీ కొనసాగనుంది. వర్షం తగ్గినా పిచ్‌పై తేమ కారణంగా నిన్న మ్యాచ్ కొనసాగే అవకాశాలు లేకుండాపోయాయి. అయితే సెమీస్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండటంతో ఇవాళ మ్యాచ్ మళ్లీ జరగనుంది. 46.1 ఓవర్ల నుంచి మ్యాచ్ మళ్లీ మొదలవుతుంది.

అంతకుముందు మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు టీమిండియా బౌలర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఒక్క పరుగుకే ఒక వికెట్ తీసి కివీస్ శిబిరంలో గుబులు రేపారు. నాలుగవ ఓవర్‌లో గప్తిల్‌ను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఒక అప్పటి నుంచి భారీ షాట్లు తీసేందుకు కివీస్ బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తిపోయారు. ఆ తర్వాత నికోల్స్‌ను జడేజా ఔట్ చేయడంతో మరింత ఆత్మరక్షణలో పడింది కివీస్.

మాంచెస్టర్‌లో జరిగిన సెమీస్‌లో టీమిండియా బౌలర్లు దుమ్ములేపారు. పదునైన బంతులతో కివీస్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. భారత బౌలర్ల ధాటికి పరుగులు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్.

న్యూజిలాండ్ మొత్తం 5 వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్, బుమ్రా, పాండ్యా, జడేజా, చాహల్ తలో వికెట్ తీసుకున్నారు. ఇవాళ మళ్లీ 46.1 ఓవర్ల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పూర్తయ్యాక మళ్లీ భారత్ బ్యాటింగ్‌కు దిగనుంది. అయితే ఈ రోజు కూడా వరుణుడు కరుణిస్తేనే మ్యాచ్ జరగనుంది.