మరో రికార్డుకు చేరువలో ధోనీ!
టీమిండియా వికెట్‌కీపర్ మహేంద్రసింగ్ ధోనీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. మాంచెస్టర్ వేదికగా మంగళవారం జరిగబోయే మ్యాచ్‌తో ధోనీ 350వ వన్డే ఆడనున్నాడు. సచిన్(463)తర్వాత 350 వన్డేలు ఆడిన భారత క్రికెటర్‌గా, ప్రపంచవ్యాప్తంగా పదో క్రికెటర్‌గా రికార్డు సృష్టించనున్నాడు. ధోనీకన్నా ముందు మహేలా జయవర్ధనే(448), సనత్‌జయసూర్య(445), కుమార సంగక్కర(404), షాహిద్ అఫ్రిది(398), ఇంజమామ్ ఉల్ హక్(378), రికీపాంటింగ్(375), వసీంఅక్రమ్(356), ముత్తయ్యమురళీథరన్(350) వరుసగా ఈ జాబితాలో ఉన్నారు. అలాగే 350 వన్డేలాడిన తొలి వికెట్‌కీపర్‌గానూ ధోనీ ప్రపంచ రికార్డు […]
టీమిండియా వికెట్‌కీపర్ మహేంద్రసింగ్ ధోనీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. మాంచెస్టర్ వేదికగా మంగళవారం జరిగబోయే మ్యాచ్‌తో ధోనీ 350వ వన్డే ఆడనున్నాడు. సచిన్(463)తర్వాత 350 వన్డేలు ఆడిన భారత క్రికెటర్‌గా, ప్రపంచవ్యాప్తంగా పదో క్రికెటర్‌గా రికార్డు సృష్టించనున్నాడు. ధోనీకన్నా ముందు మహేలా జయవర్ధనే(448), సనత్‌జయసూర్య(445), కుమార సంగక్కర(404), షాహిద్ అఫ్రిది(398), ఇంజమామ్ ఉల్ హక్(378), రికీపాంటింగ్(375), వసీంఅక్రమ్(356), ముత్తయ్యమురళీథరన్(350) వరుసగా ఈ జాబితాలో ఉన్నారు. అలాగే 350 వన్డేలాడిన తొలి వికెట్‌కీపర్‌గానూ ధోనీ ప్రపంచ రికార్డు నెలకొల్పనున్నాడు. సంగక్కర 360 మ్యాచ్‌లకు కీపర్‌గా వ్యవహరించినప్పటికీ అందులో 40వన్డేలకు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా సేవలందించాడు.