Ravindra Jadeja: ఆల్‌ రౌండర్ల జాబితాలో మళ్లీ నంబర్ వన్ స్థానానికి రవీంద్ర జడేజా..! అశ్విన్ స్థానం ఎంతంటే..?

ICC Rankings: ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. ఈ మేరకు ఐసీసీ నేడు విడుదల చేసిన ఉత్తమ ఆల్‌ రౌండర్ల జాబితాలో తొలిస్థానం దక్కిచుకున్నట్లు ప్రకటించింది.

Ravindra Jadeja: ఆల్‌ రౌండర్ల జాబితాలో మళ్లీ నంబర్ వన్ స్థానానికి రవీంద్ర జడేజా..! అశ్విన్ స్థానం ఎంతంటే..?
Ravindra Jadaja
Follow us
Venkata Chari

| Edited By: Anil kumar poka

Updated on: Jun 24, 2021 | 11:07 AM

Ravindra Jadeja: ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. ఈ మేరకు ఐసీసీ నేడు ప్రకటించిన ఉత్తమ ఆల్‌ రౌండర్ల జాబితాలో తొలిస్థానం దక్కిచుకున్నట్లు ప్రకటించింది. మొదటి సారి 2017లో అగ్రస్థానంలో కొనసాగిన జడేజా.. మరలా ఇన్నాళ్లకు తొలిస్థానం చేజిక్కించుకున్నాడు. వెస్టిండీస్ స్టార్ జాసన్ హోల్డర్‌ను అధిగమించి నంబర్‌ 1 స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నాడు. సెయింట్ లూసియాలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ టీం మధ్య జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ముగిసిన అనంతరం ఐసీసీ నేడు (జూన్ 23న) ఈ ఫలితాలను ప్రకటించింది. ఈమేరకు రవీంద్ర జడేజా తొలి స్థానంలో నిలిచాడు. రవీంద్ర జడేజా 2017 లో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బౌలింగ్, ఆల్ రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. మరలా అంటే నాలుగేళ్ల తరువాత మొదటి స్థానానికి చేరుకున్నాడు జడేజా. జాసన్ హోల్డర్ 412 పాయింట్లతో ఇప్పటి వరకు ఆల్ రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగాడు. కానీ, ప్రస్తుతం వెల్లడించిన ఫలితాల్లో అతను 28 పాయింట్లు కోల్పోయాడు. ఆల్ రౌండర్ల జాబితాలో జడేజా ప్రస్తుతం 386 పాయింట్లు సాధించాడు. హోల్డర్ 384 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మూడవ స్థానంలో ఉండగా, టీమిండియా మరో స్పిన్నర్ అశ్విన్ 4 వ స్థానంలో నిలిచాడు.

ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో జడేజా 16 వ స్థానంలో ఉండగా, అశ్విన్ రెండవ స్థానంలో, పాట్ కమ్మిన్స్ తొలి స్థానంలో నిలిచాడు. జడేజా ప్రస్తుతం సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ ) ఫైనల్‌లో ఆడుతున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 15 పరుగులు సాధించాడు. కివీస్ టీంలో టిమ్ సౌతీని పెవిలియన్ చేర్చాడు. దీంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌట్ అయింది. రిజర్వ్ డే సందర్భంగా జడేజా కీలక పాత్ర పోషించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Also Read:

IND Vs NZ, WTC Final 2021 Day 6th Live: రిజర్వ్‌డేకు చేరిన ఫైనల్‌ మ్యాచ్‌.. రహానే ఔట్

Captain of The 21st Century: 21 వ శతాబ్దపు టెస్ట్ కెప్టెన్‌ గా ఆసీస్ మాజీ ఆటగాడు స్టీవ్ వా ఎంపిక..!

Shaminda Eranga : టెస్ట్, వన్డే, టీ 20 ఫార్మాట్లలో మొదటి ఓవర్‌లోనే వికెట్ సాధించిన ఏకైక బౌలర్..!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా