Domestic Cricket: దేశీవాళీ క్రికెట్ సీజన్ షెడ్యూల్ ఇదే.. ప్రకటించిన బీసీసీఐ.. రంజీ ట్రోఫీ ఎప్పుడంటే..?
Domestic Cricket: భారత క్రికెట్ జట్టుకు ఎందరో దిగ్గజాలను అందించిన డొమెస్టిక్ క్రికెట్ సీజన్ జూన్ 28 నుంచి ప్రారంభం కాబోతుంది. 2023-24 దేశీవాలి క్రికెట్ సీజన్ దులీప్ ట్రోఫీతో జూన్ 28న ప్రారంభమవుతుంది. అలాగే జులై 24 నుంచి ఆగస్టు..
Domestic Cricket: భారత క్రికెట్ జట్టుకు ఎందరో దిగ్గజాలను అందించిన డొమెస్టిక్ క్రికెట్ సీజన్ జూన్ 28 నుంచి ప్రారంభం కాబోతుంది. 2023-24 దేశీవాలి క్రికెట్ సీజన్ దులీప్ ట్రోఫీతో జూన్ 28న ప్రారంభమవుతుంది. అలాగే జులై 24 నుంచి ఆగస్టు 4 వరకు దేవధర్ ట్రోఫీ.. ఇరానీ కప్ అక్టోబర్ 1 నుంచి 5 మధ్య జరగనున్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం అక్టోబర్ 16 నుంచి 27 వరకు టీ20 టోర్నీ జరగనుంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 6 వరకు మొహాలీలో నాకౌట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్‌లు నవంబర్ 23 నుంచి డిసెంబర్ 5 వరకు జరగనుండగా, నాకౌట్ మ్యాచ్‌లు డిసెంబర్ 9 నుంచి 16 వరకు జరగనున్నాయి. ఇవన్నీ ముగిసిన తర్వాత భారత ప్రీమియర్ రెడ్-బాల్ దేశీ టోర్నమెంట్ అయిన రంజీ ట్రోఫీ 2024 వచ్చే ఏడాది జనవరి 5 నుంచి మార్చి 14 వరకు జరుగుతుంది.
2023-24 దేశీవాళీ క్రికెట్ సీజన్‌లో పాల్గొనే జట్ల వివరాలు
- గ్రూప్ A: సౌరాష్ట్ర, జార్ఖండ్, మహారాష్ట్ర, విదర్భ, రాజస్థాన్, హర్యానా, మణిపూర్.
- గ్రూప్ బి: బెంగాల్, ఆంధ్రా, ముంబై, కేరళ, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, బీహార్.
- గ్రూప్ సి: కర్ణాటక, పంజాబ్, రైల్వేస్, తమిళనాడు, గోవా, గుజరాత్, త్రిపుర, చండీగఢ్.
- గ్రూప్ డి: మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్, బర్దా, ఢిల్లీ, ఒడిశా, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్.
- ప్లేట్ గ్రూప్: నాగాలాండ్, హైదరాబాద్, మేఘాలయ, సిక్కిం, మిజోరాం, అరుణాచల్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..