Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranji Trophy: వామ్మో.. ఇదేం ఉతుకుడు సామీ.. 12 సిక్సర్లు, 11 ఫోర్లతో ఊచకోత.. ఐపీఎల్‌కు ముందే శాంసన్ టీంమేట్ భీభత్సం..

Ranji Trophy 2024, Riyan Parag: ఈ మ్యాచ్‌లో అస్సాం కెప్టెన్ రియాన్ పరాగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి తన ఆటతీరుతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. అయినప్పటికీ తన జట్టును గెలిపించలేకపోయాడు. రాయ్‌పూర్‌లో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో, పరాగ్ 8 పరుగులు చేసి ఔటయ్యాడు. దీనితో అతని జట్టు కూడా కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ప్రారంభించిన అస్సాం జట్టుకు శుభారంభం లభించలేదు. కేవలం 78 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు.

Ranji Trophy: వామ్మో.. ఇదేం ఉతుకుడు సామీ.. 12 సిక్సర్లు, 11 ఫోర్లతో ఊచకోత.. ఐపీఎల్‌కు ముందే శాంసన్ టీంమేట్ భీభత్సం..
Ranji Trophy 2024 Riyan Par
Follow us
Venkata Chari

|

Updated on: Jan 08, 2024 | 7:35 PM

Ranji Trophy 2024, Riyan Parag: ప్రస్తుతం, భారత దేశవాళీ సీజన్ కొనసాగుతోంది. రంజీ ట్రోఫీ 2024తో ఆటగాళ్లు బిజీగా ఉన్నారు. ఈ సీజన్ జనవరి 5 నుంచి ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌లో ఛత్తీస్‌గఢ్, అస్సాం జట్లు ముఖాముఖిగా తలపడ్డాయి. అయితే, ఈ మ్యాచ్‌లో చత్తీస్‌గఢ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది.

ఈ మ్యాచ్‌లో అస్సాం కెప్టెన్ రియాన్ పరాగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి తన ఆటతీరుతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. అయినప్పటికీ తన జట్టును గెలిపించలేకపోయాడు. రాయ్‌పూర్‌లో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో, పరాగ్ 8 పరుగులు చేసి ఔటయ్యాడు. దీనితో అతని జట్టు కూడా కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో ప్రారంభించిన అస్సాం జట్టుకు శుభారంభం లభించలేదు. కేవలం 78 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు.

అయితే, ఈ 22 ఏళ్ల యువకుడు రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు. 87 బంతులు ఎదుర్కొని 155 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో అతని బ్యాట్‌లో 11 ఫోర్లు, 12 సిక్సర్లు వచ్చాయి. ఈ సమయంలో స్ట్రైక్ రేట్ 178.16లుగా ఉంది. ఆరంభం నుంచి ఛత్తీస్ గఢ్ బౌలర్లను శాసించిన ర్యాన్ పరాగ్.. కేవలం 56 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడిపోతున్నా మరోవైపు పరాగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు 200 దాటించాడు. అస్సాం జట్టులోని మిగిలిన బ్యాట్స్‌మెన్లు రాణించలేకపోయారు. ఫలితంగా ఈ జట్టు మొత్తం రెండో ఇన్నింగ్స్‌లో 254 పరుగులకు ఆలౌట్ అయింది.

పరాగ్ నేతృత్వంలోని అస్సాం ఛత్తీస్‌గఢ్‌కు 87 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దానిని ఆ జట్టు వికెట్ నష్టపోకుండా చేరుకున్నారు. ఛత్తీస్‌గఢ్ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో పరాగ్‌తో పాటు ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగారు. దీంతో ఆ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

కాగా, రంజీ టోర్నీలో రిషబ్ పంత్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2016లో ఛత్తీస్‌గఢ్‌పై పంత్ కేవలం 48 బంతుల్లోనే సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రధాని మోదీ నిరాడంబరతకు ముగ్ధులైన శ్రీలంక క్రికెట్ దిగ్గజాలు
ప్రధాని మోదీ నిరాడంబరతకు ముగ్ధులైన శ్రీలంక క్రికెట్ దిగ్గజాలు
ఉక్కపోతకు చెక్‌ పెట్టే పోర్టబుల్‌ ఏసీ.. ఇది ఉంటే చలితో వణికిపోవాల
ఉక్కపోతకు చెక్‌ పెట్టే పోర్టబుల్‌ ఏసీ.. ఇది ఉంటే చలితో వణికిపోవాల
శ్రీరామనవమికి ఈ ఆలయ దర్శనం.. జీవితంలో మరపురాని గుర్తు..
శ్రీరామనవమికి ఈ ఆలయ దర్శనం.. జీవితంలో మరపురాని గుర్తు..
ఆరేళ్ల క్రితం ఈవెంట్ అని పిలిచి.. జబర్దస్త్ వర్ష ఎమోషనల్..
ఆరేళ్ల క్రితం ఈవెంట్ అని పిలిచి.. జబర్దస్త్ వర్ష ఎమోషనల్..
ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
భర్త కోసం అమ్మాయిని సెట్ చేసే భార్య.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ
భర్త కోసం అమ్మాయిని సెట్ చేసే భార్య.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ
శ్రీరామ నవమి వేళ.. అయోధ్యలో అద్భుత ఘట్టం..! పోటెత్తిన భక్తులు
శ్రీరామ నవమి వేళ.. అయోధ్యలో అద్భుత ఘట్టం..! పోటెత్తిన భక్తులు
విదుర నీతిలోని అద్భుతమైన జీవిత సత్యాలు..!
విదుర నీతిలోని అద్భుతమైన జీవిత సత్యాలు..!
రాములవారి తలంబ్రాలను ఇంటికి తెస్తున్నారా.. ఇది తెలుసుకోండి
రాములవారి తలంబ్రాలను ఇంటికి తెస్తున్నారా.. ఇది తెలుసుకోండి
వాస్తు ప్రకారం ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకోవద్దు.. ఎందుకంటే..
వాస్తు ప్రకారం ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకోవద్దు.. ఎందుకంటే..