Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీకి కోట్ల ఆఫర్లు.. భవిష్యత్ స్టార్‌గా తీర్చిదిద్దే బాధ్యత ద్రవిడ్ దే
14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అండర్-19 క్రికెట్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అతనికి కోట్ల రూపాయల ఆఫర్లు వస్తున్నా, రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో క్రమశిక్షణతో ఉన్నాడు. భవిష్యత్తులో అతను మరో పృథ్వీ షా అవతాడా లేదా అనేది వేచి చూడాలి.

Vaibhav Suryavanshi : భారత క్రికెట్‌లో ప్రస్తుతం 14ఏళ్ల కుర్రాడు అదరగొడుతున్నాడు. వైభవ్ సూర్యవంశీ రోజురోజుకు అద్భుతాలు చేస్తున్నాడు. అతను ఆడిన ప్రతి మ్యాచ్‌లో నిలకడగా పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న భారత అండర్-19 జట్టులో సూర్యవంశీ సభ్యుడు. ఇప్పుడు అతడు మరోసారి చర్చల్లో నిలిచాడు. ఎందుకంటే అతను కేవలం 78 బంతుల్లోనే 143 పరుగులు బాదాడు. యూత్ వన్డేల్లో కూడా అతను ఇంతకుముందు 48, 45, 86 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో శుభమన్ గిల్ బ్యాటింగ్ చేసినట్లుగానే సూర్యవంశీ కూడా బ్యాటింగ్ చేయడం కనిపించిందని అంటున్నారు.
ఇదంతా బాగానే ఉన్నా వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో ఒక స్టార్‌గా ఎదగాలంటే మైదానం బయట అతని దృష్టి మరలకూడదని కొందరు సూచిస్తున్నారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, సూర్యవంశీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. అతను ఇప్పుడే తన ఏకాగ్రత కోల్పోకుండా చూసుకుంటున్నారు.మాజీ భారత కోచ్ రవి శాస్త్రి మాట్లాడుతూ.. సూర్యవంశీకి చాలా ఆఫర్లు వస్తున్నాయి. అవన్నీ కమర్షియల్ ఆఫర్లే అని చెప్పారు. అయితే, రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్, వైభవ్‌ను పూర్తిగా గైడ్ చేస్తున్నట్లు తెలిపారు.
మ్యాచ్ బ్రాడ్‌కాస్టర్‌తో రవి శాస్త్రి మాట్లాడుతూ.. తాను సంగక్కరతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. సూర్యవంశీకి చాలా ఎండార్స్‌మెంట్ డీల్స్ వస్తున్నాయని అతడు చెప్పాడు. కానీ, వైభవ్ సూర్యవంశీ వాటిని చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నాడు. కారణం అతనికి రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. ద్రవిడ్ అతనికి మెంటార్, కోచ్. అతను సూర్యవంశీని నిలకడగా ఉంచుతున్నారు. ఈ వయస్సు చాలా కీలకం. భారతదేశంలో 16, 17, 18 సంవత్సరాల వయస్సున్న చాలా మంది టాలెంట్ పీపుల్ కనిపిస్తారు. సచిన్ టెండూల్కర్ ఒక బెంచ్‌మార్క్‌ను సెట్ చేశాడు. కానీ 23, 24 సంవత్సరాల వయస్సులో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనే దానిపై అంతా ఆధారపడి ఉంటుంది. చాలా మంది ఈ వయస్సులో దారి తప్పారు. అలాంటి టాలెంటును జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరమని రవి శాస్త్రి అన్నారు.
రికార్డు సెంచరీ చేసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ.. శుభమన్ గిల్ నుంచి తనకు స్ఫూర్తి లభించిందని చెప్పాడు. BCCI సూర్యవంశీకి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేసింది. అందులో అతను తన సెంచరీ గురించి మాట్లాడాడు. తనకు రికార్డు గురించి తెలియదని సూర్యవంశీ అన్నాడు. 100 పరుగులు చేసిన తర్వాత, టీమ్ మేనేజర్ అంకిత్ సార్ రికార్డు సృష్టించానని చెప్పినట్లు సూర్యవంశీ అన్నాడు. భవిష్యత్తులో 200 పరుగులు చేయడానికి ప్రయత్నిస్తానని అతను చెప్పినట్లు తెలుస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..