Ind vs Eng : రెండో టెస్ట్‌కు వరుణ గండం..భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ డ్రా అవుతుందా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ ఐదో రోజు వర్షం కారణంగా ఆలస్యం అవుతోంది. వర్షం కొనసాగితే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది. టెస్ట్ క్రికెట్ నియమాలు, వాతావరణం మ్యాచ్ ఫలితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం. ఒకవేళ వర్షం ఆగకుండా మ్యాచ్ రద్దు అయితే టీం ఇండియా కష్టం వృధా అయినట్లే.

Ind vs Eng : భారత్, ఇంగ్లాండ్ మధ్య ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నేడు ఐదో రోజుకు చేరుకుంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఆట ప్రారంభం కావాల్సి ఉంది..అయితే వర్షం కారణంగా ఆట ఆలస్యమైంది. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారీ వర్షం కురుస్తోంది. ఒకవేళ ఈ వర్షం ఈరోజు ఆటలో నిరంతరంగా కొనసాగితే ఐదవ రోజు ఆట నిలిచిపోయే అవకాశం ఉంది.
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు నేడు చాలా కీలకమైన రోజ. మ్యాచ్ చివరి అంకానికి చేరుకుంటున్న తరుణంలో ఐదో రోజు ఆట ప్రారంభానికి ముందే వర్షం ఆటంకం కలిగించింది. ఒకవేళ ఈ వర్షం ఆగకుండా కొనసాగితే, మ్యాచ్ సమయం ముగిసిపోతే ఈ మ్యాచ్‌ను డ్రాగా ప్రకటిస్తారు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కు రిజర్వ్ డే అంటూ ఏమీ లేదు. ఇది ఒక సాధారణ టెస్ట్ మ్యాచ్. కేవలం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ వంటి మ్యాచ్‌లకు మాత్రమే రిజర్వ్ డే ఉంటుంది. మిగిలిన అన్ని టెస్ట్ మ్యాచ్‌ల ఫలితం ఐదు రోజులలోపే వస్తుంది. మ్యాచ్‌కు ఫలితం తేలని పక్షంలో, ఆ మ్యాచ్‌ను డ్రాగా పరిగణిస్తారు.
Weather report: 𝑾𝒆𝒕 🌧️
We’ll have a delayed start at Edgbaston. pic.twitter.com/3aNVr52LPQ
— England Cricket (@englandcricket) July 6, 2025
భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదో రోజు ఆటలో ఎక్కువ భాగం వర్షం కారణంగా రద్దు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మ్యాచ్‌లో మొదటి సెషన్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని ముందే అంచనా వేశారు. అది ఆట ప్రారంభంలోనే నిజమైంది. ఇక రెండో, మూడో సెషన్లలో కూడా వర్షం ఆటను అడ్డుకోవచ్చు. ఇలా జరిగితే ఈ పరిస్థితి ఇంగ్లాండ్ జట్టుకు నేరుగా లాభం చేకూరుస్తుంది. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ గెలవడానికి ఇంగ్లాండ్‌కు ఇంకా 536 పరుగులు చేయాలి. మరోవైపు, భారత్ గెలవాలంటే ఇంగ్లాండ్ ఏడు వికెట్లను పడగొట్టాలి. ఒకవేళ ఐదో రోజులో ఎక్కువ సమయం వర్షం కారణంగా పోతే ఈ మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది.
అయితే, వర్షం ఆగి మ్యాచ్ జరిగితే మైదానంలో తేమ కారణంగా వేగవంతమైన గాలులు వీస్తాయి. ఇది భారత పేస్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్ లకు ప్రయోజనం చేకూర్చవచ్చు. అలాంటి పరిస్థితులలో వారు స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టగలరు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..