PBKS IPL 2025: కెప్టెన్‌పై వేటు.. యంగ్ సెన్సేషన్లకు చోటు.. రూ. 112 కోట్లతో పంజాబ్ కంబ్యాక్.!

ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఒక్క ట్రోఫీ కూడా దక్కించుకొని ఫ్రాంచైజీల జాబితాలో పంజాబ్ కింగ్స్ కూడా ముందు వరుసలో ఉంటుంది. సీజన్లు మారాయి.. కోచ్‌లు మారుతూ వచ్చారు.. అయినా లాభం లేకుండా పోయింది. అయితే ఈసారి..

PBKS IPL 2025: కెప్టెన్‌పై వేటు.. యంగ్ సెన్సేషన్లకు చోటు.. రూ. 112 కోట్లతో పంజాబ్ కంబ్యాక్.!
Pbks
Follow us

|

Updated on: Oct 31, 2024 | 9:39 PM

ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఒక్క ట్రోఫీ కూడా దక్కించుకొని ఫ్రాంచైజీల జాబితాలో పంజాబ్ కింగ్స్ కూడా ముందు వరుసలో ఉంటుంది. సీజన్లు మారాయి.. కోచ్‌లు మారుతూ వచ్చారు.. అయినా లాభం లేకుండా పోయింది. అయితే ఈసారి ఐపీఎల్ 18లో కచ్చితంగా ట్రోఫీ గెలవాలన్న నిర్ణయంతో మెగా వేలంలోకి అడుగుపెడుతోంది పంజాబ్. ఈ నేపధ్యంలోనే భవిష్యత్తుపై దృష్టి పెట్టు రిటైన్ లిస్టును సిద్దం చేసింది. ఇక అందరూ ఊహించినట్టే.. ఈ సీజన్‌లో దుమ్ములేపిన యువ సెన్సేషన్లు శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌లకు ఛాన్స్ ఇచ్చింది.

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

ఇవి కూడా చదవండి

అశుతోష్ శర్మ, అర్ష్‌దీప్‌లను కూడా వదిలేసింది పంజాబ్. అటు టీంలో ఉన్న పెద్ద స్టార్ ప్లేయర్స్ బెయిర్ స్టో, లివింగ్ స్టన్, సామ్ కర్రన్, రబడా, క్రిస్ వోక్స్‌తో పాటు కెప్టెన్ శిఖర్ ధావన్‌కు కూడా మొండిచెయ్యి చూపించింది. ఐపీఎల్ రిటైన్ రూల్స్ ప్రకారం.. శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌లు అన్ క్యాప్డ్ ప్లేయర్స్ కావడంతో.. ఇరువురికి రూ. 5.5 కోట్లు, రూ. 4 కోట్ల చొప్పున పారితోషికాలు ఇవ్వనున్నారు. ఇక మెగా వేలంలోకి పంజాబ్ కింగ్స్.. అందరికంటే పర్స్ రూ. 112 కోట్లతో అడుగుపెట్టనుంది.

పంజాబ్ కింగ్స్: 

శశాంక్ సింగ్ (INR 5.5 కోట్లు), 

ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (INR 4 కోట్లు)

వేలానికి మిగిలి ఉన్న పర్స్: INR 110.5 కోట్లు (INR 120 కోట్లలో)

రైట్-టు-మ్యాచ్ (RTM): 4

పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు:

అశుతోష్ శర్మ, అర్షదీప్ సింగ్, శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కరన్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, హర్‌ప్రీత్ బార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, రిలే రోసో, తనయ్ త్యాగరాజన్, హర్‌ప్రీత్ సింగ్, విద్వాత్ కవెరప్ప, సికందర్ రజా, నాథన్ ఎలిస్, శివమ్ సింగ్, క్రిస్ వోక్స్, రిషి ధావన్, అథర్వ, ప్రిన్స్ చౌదరి, విశ్వనాథ్ సింగ్.

ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..