AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: 55 ఫోర్లు, 28 సిక్స్‌లు.. 517 పరుగులతో ఐపీఎల్ ఆణిముత్యం భారీ రికార్డ్..

Punjab Kings vs Royal Challengers Bengaluru, Qualifier 1 IPL 2025: పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, అతని చిన్న ఇన్నింగ్స్‌లో, ఓ భారీ రికార్డును సృష్టించగలిగాడు.

IPL 2025: 55 ఫోర్లు, 28 సిక్స్‌లు.. 517 పరుగులతో ఐపీఎల్ ఆణిముత్యం భారీ రికార్డ్..
Prabhsimran Singh 500 Run In Ipl 2025
Venkata Chari
|

Updated on: May 29, 2025 | 9:39 PM

Share

Prabhsimran singh: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఐపీఎల్ 2025 (IPL 2025)లో అద్భుతంగా రాణించాడు. ఈ ఆటగాడు ఇంకా టీమ్ ఇండియా తరపున అరంగేట్రం చేయలేకపోయాడు. కానీ, తన ప్రదర్శనతో మాత్రం అంతర్జాతీయ ఆటగాళ్లను అధిగమించాడు. అయితే, క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ బ్యాట్ బాగా రాణించలేదు. అతను RCBపై కేవలం 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ప్రభ్‌సిమ్రాన్ రాణించలేదు. కానీ, తన పేరు మీద భారీ రికార్డు సృష్టించాడు. ఈ టోర్నమెంట్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 500 పరుగులు సాధించగలిగాడు.

ప్రభ్‌సిమ్రాన్ అద్భుతం..

ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఐపీఎల్ 2025లో 15 మ్యాచ్‌ల్లో 517 పరుగులు చేశాడు. ఈ ఆటగాడు 34.47 సగటుతో పరుగులు చేశాడు. ఈ ఆటగాడి స్ట్రైక్ రేట్ 166 కంటే ఎక్కువ. అతను 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఐపీఎల్ సీజన్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన తొలి భారత ఆటగాడిగా ప్రభ్‌సిమ్రాన్ సింగ్ నిలిచాడు. 2008లో పంజాబ్ కింగ్స్ తరపున షాన్ మార్ష్ ఈ ఘనత సాధించాడు. ఆ సమయంలో అతను అన్‌క్యాప్డ్ ప్లేయర్ కూడా. కానీ అతను విదేశీ ఆటగాడు.

అన్‌క్యాప్డ్ ప్లేయర్లు అద్భుతాలు..

ఇప్పటివరకు, మొత్తం 6గురు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు ఐపీఎల్ సీజన్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఘనతను సాధించారు. 2008లో షాన్ మార్ష్ తర్వాత, సూర్యకుమార్ యాదవ్ 2018లో ఈ ఘనత సాధించాడు. 2020లో, ఇషాన్ కిషన్ అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా 500 కంటే ఎక్కువ పరుగులు సాధించగలిగాడు. యశస్వి జైస్వాల్ ఈ పని 2023 లో చేశాడు. 2024 లో రియాన్ పరాగ్, ఇప్పుడు 2025 లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఈ ఘనతను సాధించారు.

దారుణంగా పంజాబ్ పరిస్థితి..

ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఈ రికార్డును సృష్టించాడు.. కానీ, అతను ఔట్ అయిన తర్వాత పంజాబ్ పరిస్థితి మరింత దిగజారింది. ఆ జట్టు కేవలం 97 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. కేవలం 7 పరుగులకే ప్రియాంష్ ఆర్య ఔటయ్యాడు. ప్రభ్‌సిమ్రాన్ 18 పరుగులు చేశాడు. జోష్ ఇంగ్లిస్ కేవలం 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు. శ్రేయాస్ అయ్యర్ కేవలం 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. నెహాల్ వాధేరా కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. శశాంక్ సింగ్ కూడా 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆర్‌సీబీ ఫాస్ట్ బౌలర్లు పంజాబ్‌ను కుదిపేశారు. భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీసుకున్నాడు. యష్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. సుయాష్ శర్మ కూడా తన మొదటి ఓవర్లోనే వికెట్ తీసుకున్నాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..