IPL 2026: శాంసన్ కోసం డేంజరస్ టీ20 ప్లేయర్‌ను ఎరగా వేసిన పంజాబ్.. కట్‌చేస్తే..
PBKS vs RR: పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు గతంలో కూడా శాంసన్ పట్ల ఆసక్తి చూపింది. బలమైన భారతీయ బ్యాటింగ్‌ను నిర్మించడం, స్థిరమైన కెప్టెన్ కోసం వెతకడమే పంజాబ్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. సంజూ శాంసన్ వంటి స్థిరమైన కెప్టెన్ దొరికితే, తమ జట్టుకు కొత్త బలం వస్తుందని పంజాబ్ భావించింది.

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 మినీ వేలం, ట్రేడ్ విండోకు ముందు, ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు, రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson)ను తమ జట్టులోకి తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ విషయం మరెవరో కాదు, రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించారు.
స్టోయినిస్ vs శాంసన్: రవిచంద్రన్ అశ్విన్ తన తాజా వీడియోలో మాట్లాడుతూ, ట్రేడ్ విండోలో జరిగిన కీలక చర్చలను బయటపెట్టాడు.
పంజాబ్ కింగ్స్ (PBKS) ఆఫర్: పంజాబ్ కింగ్స్ జట్టు, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ అయిన సంజూ శాంసన్‌ను తమకు ఇచ్చే పక్షంలో, తమ కీలక ఆల్‌రౌండర్ అయిన మార్కస్ స్టోయినిస్ (Marcus Stoinis)ను రాజస్థాన్‌కు ట్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రతిపాదించింది.
రాజస్థాన్ రాయల్స్ తిరస్కరణ: అయితే, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంతోపాట జట్టు నాయకత్వం ఈ ప్రతిపాదనను గట్టిగా తిరస్కరించింది.
ఈమేరకు అశ్విన్ మాట్లాడుతూ, “పంజాబ్ కింగ్స్.. సంజూ శాంసన్ కోసం రాజస్థాన్ రాయల్స్‌ను సంప్రదించింది. అందుకు బదులుగా వారు స్టోయినిస్‌ను ఇవ్వజూపారు. అయితే, సంజూ కేవలం ఒక ఆటగాడు కాదు, అతను రాజస్థాన్ రాయల్స్ జట్టుకు గుండెకాయ వంటివాడు. అందుకే రాజస్తాన్ రాయల్స్ ఈ డీల్‌ను పట్టించుకోలేదు” అని స్పష్టం చేశాడు.
సంజూ శాంసన్ రాజస్తాన్‌కు ఎందుకు కీలకం?
సంజూ శాంసన్ కేవలం బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదు, రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంఛైజీకి అతను చాలా కీలకమైన అంశం. 2021 నుంచి జట్టుకు నాయకత్వం వహిస్తున్న సంజూ, జట్టును 2022 ఫైనల్‌కు నడిపించాడు. అతని స్థిరమైన కెప్టెన్సీ ఆర్ఆర్ ప్రధాన బలం.
గత కొన్ని సీజన్లలో సంజూ నిలకడైన ప్రదర్శన కనబరుస్తూ, మిడిల్ ఆర్డర్‌లో పటిష్టమైన స్థంభంలా నిలబడ్డాడు.
కేరళకు చెందిన సంజూ శాంసన్‌కు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాదిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతను రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్‌కు ప్రతిరూపంగా మారాడు.
రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీకి సంజూ విలువ కేవలం మైదానంలో పరుగులకే పరిమితం కాదు, అతని నాయకత్వం, అనుభవం, బ్రాండ్ ఐడెంటిటీ కారణంగానే మార్కస్ స్టోయినిస్ వంటి ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్‌ను ఆఫర్ చేసినా రాజస్థాన్ పట్టించుకోలేదని అశ్విన్ వ్యాఖ్యానించాడు.
పంజాబ్ కింగ్స్ వ్యూహం ఏంటి?
మరోవైపు, పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు గతంలో కూడా శాంసన్ పట్ల ఆసక్తి చూపింది. బలమైన భారతీయ బ్యాటింగ్‌ను నిర్మించడం, స్థిరమైన కెప్టెన్ కోసం వెతకడమే పంజాబ్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. సంజూ శాంసన్ వంటి స్థిరమైన కెప్టెన్ దొరికితే, తమ జట్టుకు కొత్త బలం వస్తుందని పంజాబ్ భావించింది.
ఐపీఎల్ మినీ వేలం, మెగా వేలం ముందు ఇలాంటి ట్రేడ్ చర్చలు సాధారణమే అయినప్పటికీ, రవిచంద్రన్ అశ్విన్ చేసిన ఈ ప్రకటన అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








