Wasim Akram: ఇండియాను చూసి నేర్చుకోండి.. ఆ దేశం ఏం చేయాలో అదే చేస్తుంది. పాక్ మాజీ ఆటగాడు అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.
Wasim Akram: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పాక్తిస్తాన్ క్రికెట్ సెలక్షన్ కమిటీలో ప్రస్తుత సభ్యుడైన వసీం అక్రమ్ తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో..
Wasim Akram: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పాక్తిస్తాన్ క్రికెట్ సెలక్షన్ కమిటీలో ప్రస్తుత సభ్యుడైన వసీం అక్రమ్ తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో పాక్ పేలవ ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ ముగిన తర్వాత ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు జింబావ్వే టూర్‌కు వెళ్లనుంది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ తీసుకున్న ఈ నిర్ణయంపై వసీం అక్రమ్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌తో ఓటమిపాలైన తర్వాత జింబావ్వేతో టూర్ ప్లాన్ చేయడం సరికాదని అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జింబావ్వే టూర్లు ఏర్పాటు చేస్తున్న జీనియస్‌ను కలిసి.. పాకిస్తాన్ క్రికెట్ అభివృద్ధికి ఎంతో పాటుపడుతూ గొప్ప పని చేస్తున్నావని మెచ్చుకోవాలని ఉందంటూ తనదైన శైలిలో చురకలు అంటించారు.
జింబాబ్వేతో సిరీస్‌లు ఆడడం వల్ల పాకిస్తాన్ క్రికెట్‌కు ఎలాంటి ఉపయోగం లేదని తెలిపిన వసీం.. నాలుగేళ్లకోసారి జింబాబ్వే టూర్ జరిగితే పర్లేదు కానీ. పెద్ద టీమ్‌లతో ఓటమిపాలైన ప్రతీసారీ పసికూన జట్టుతో ఆడి గెలిచి ఏం నిరూపించుకోవాలనుకుంటున్నారని సూటిగా ప్రశ్నించాడు. పసికూన జట్లతో ఆడుతూ ర్యాంకులు మెరుగుపరుచుకోవడం తప్ప ఈ టూర్ల వల్ల జరిగే ప్రయోజనం ఏమి ఉండదని వసీం అభిప్రాయపడ్డారు. అందులోనూ టీమిండియాతో పోల్చుకోవడం సరైంది కాదని తెలిపారు. ఇక బీసీసీఐ క్రికెట్ అభివృద్ధి కోసం చేయాలో తెలుసుకొని అదే చేస్తోందన్న వసీం.. అద్భుతమైన ప్రొఫెషనల్ క్రికెటర్లను తయారు చేసేందుకు వాళ్లు డబ్బులు ఖర్చు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ కమిటీలో సభ్యుడుగా ఉన్న అక్రమ్.. జట్టులోకి ప్లేయర్స్‌ను తీసుకోమని రికమండ్ చేయడం మానుకోండని హితవు పలికారు. ఇది 21వ శతాబ్ధం అని తెలిపన అక్రమ్.. జట్టును ఎంపిక చేయడానికి ముందు నాకు అనేక కాల్స్ వస్తున్నాయి. ఫలానా క్రికెటర్‌ను తీసుకోండి, ఈ ప్లేయర్‌ను ఆడించండి… అంటూ రికమండ్ చేస్తున్నారన్నారు. ఇవి తమను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయన్న ఆయన.. దయచేసి ఫలానా ప్లేయర్‌ను తీసుకోమని కోరే బదులు, ఆ క్రికెటర్‌ను సరిగా ఆడమనండి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా శ్రీలంక కోసం జట్టును, ఇంగ్లండ్‌తో ఆడడానికి మరో జట్టును సిద్ధం చేసిందని అక్రమ్ అభిప్రాయపడ్డారు. భారత క్రికెట్ బోర్డ్ పదేళ్ల క్రితమే వ్యవస్థను అభివృద్ధి చేసిందని అక్రమ్ చెప్పుకొచ్చారు. మరి వసీం అక్రమ్ చేసిన ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read: Tokyo Olympics 2021: చరిత్ర సృష్టించిన బెర్ముడా.. ఒలింపిక్స్‌లో మొదటిసారిగా స్వర్ణం కైవసం..
కేవలం 26 నిమిషాలు.. 36 బంతులు.. అంతే సెంచరీ బాదేశాడు..! డేంజర్ బ్యాట్స్‌మెన్..