IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్‌లో గెలిచేది ఆ జట్టే.. తేల్చేసిన పాక్ మాజీ ప్లేయర్.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్..
Kamran Akmal Predicts IND vs PAK Match Winner: వెస్టిండీస్, అమెరికాలో జరగబోయే T20 ప్రపంచ కప్ కోసం అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. టోర్నీలో పాల్గొని రెండోసారి టైటిల్ సాధించాలనే కలను నెరవేర్చుకునేందుకు భారత క్రికెట్ జట్టు కూడా అమెరికా చేరుకుంది. జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ ఈ మెగా ఈవెంట్‌లో భారత జట్టు తొలి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడనుంది. అయితే, క్రికెట్ ప్రపంచంలోని అభిమానులంతా జూన్ 9 కోసం ఎదురుచూస్తున్నారు.

Kamran Akmal Predicts IND vs PAK Match Winner: వెస్టిండీస్, అమెరికాలో జరగబోయే T20 ప్రపంచ కప్ కోసం అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. టోర్నీలో పాల్గొని రెండోసారి టైటిల్ సాధించాలనే కలను నెరవేర్చుకునేందుకు భారత క్రికెట్ జట్టు కూడా అమెరికా చేరుకుంది. జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ ఈ మెగా ఈవెంట్‌లో భారత జట్టు తొలి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడనుంది. అయితే, క్రికెట్ ప్రపంచంలోని అభిమానులంతా జూన్ 9 కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రోజున క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ న్యూయార్క్‌లో జరగనుంది. ఈ గొప్ప మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరుకు ముందు ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారోనని పాక్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ జోస్యం చెప్పాడు.
కమ్రాన్ అక్మల్ ఏమన్నాడంటే..
కమ్రాన్ అక్మల్ ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చన్ – ఆన్సర్ సెషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని టీ20 వరల్డ్‌కప్‌లో భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ కమ్రాన్ అక్మల్ భారత జట్టును ఎంపిక చేశాడు. అక్మల్ సమాధానంతో పాక్ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.
Kamran Akmal picks India as the winner against Pakistan in the #T20WorldCup match in New York 🇵🇰🇮🇳🤯🤯
Do you agree with his prediction? 👀 pic.twitter.com/tMZouS3eXa
— Farid Khan (@_FaridKhan) May 28, 2024
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ షా అఫ్రిది వంటి స్టార్ ప్లేయర్లు చాలా మంది ఉన్నప్పటికీ, కమ్రాన్ అక్మల్ భారత జట్టును విజేతగా ఎందుకు ఎంచుకున్నాడు అనే విషయం వెల్లడి కాలేదు. అయితే, ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందని భావిస్తున్నారు.
పేలవంగా పాకిస్తాన్ రికార్డ్..
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్థాన్ రికార్డు పేలవంగా ఉంది. ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 6 మ్యాచ్‌లు గెలిచింది. పాక్ జట్టు కేవలం 1 విజయాన్ని మాత్రమే నమోదు చేయగలిగింది. 2021లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ భారత్‌పై ఏకైక విజయాన్ని నమోదు చేసింది. ఇటువంటి పరిస్థితిలో, భారత జట్టు తన అద్భుతమైన రికార్డును మరింత మెరుగుపరచాలనుకుంటోంది. అదే సమయంలో పటిష్ట ప్రదర్శన ఆధారంగా పాక్ విజయం సాధించేందుకు ప్రయత్నిస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




