PAK vs AUS: ఆజామూ.. ఆగమాగం.. ఆసీస్ బౌలర్ల దెబ్బకు కెరీర్‌లోనే చెత్త రికార్డ్.. మూడో టెస్ట్‌లోనూ ఓటమి దిశగా పాక్

Babar Azam, PAK vs AUS: కాగా, మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ తన రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. మొత్తంగా 82 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. మ్యాచ్‌లో మూడో రోజైన శుక్రవారం ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 116/2 స్కోరుతో నిలిచింది. మూడో రోజు రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా జట్టు 299 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ తరపున అమీర్ జమాల్ అత్యధికంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. కాగా, ఆస్ట్రేలియా తరఫున మార్నస్ లాబుషాగ్నే, మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీలు చేశారు.

PAK vs AUS: ఆజామూ.. ఆగమాగం.. ఆసీస్ బౌలర్ల దెబ్బకు కెరీర్‌లోనే చెత్త రికార్డ్.. మూడో టెస్ట్‌లోనూ ఓటమి దిశగా పాక్
Babar Azam Vs Aus
Follow us
Venkata Chari

|

Updated on: Jan 05, 2024 | 1:23 PM

Babar Azam Australia vs Pakistan: ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లో చివరి మ్యాచ్‌ సిడ్నీ వేదికగా జరుగుతోంది. ఈ సిరీస్‌లో పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు బాబర్ ఆజం ఘోరంగా విఫలమయ్యాడు. అతను 6 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఈ సమయంలో బాబర్ మొత్తం 126 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌లో బాబర్ అత్యుత్తమ స్కోరు 41 పరుగులుగా నిలిచింది. బాబర్ తన పేవల ప్రదర్శనతో ప్రస్తుతం విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

పెర్త్ వేదికగా పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ 21 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ క్రమంలో 54 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు బాదాడు. రెండో ఇన్నింగ్స్‌లో 37 బంతులు ఎదుర్కొని 14 పరుగులు చేసి బాబర్ ఔటయ్యాడు. అతను 2 ఫోర్లు కొట్టాడు. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్‌ మెల్‌బోర్న్‌లో జరిగింది. బాబర్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. కాగా రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. తొలి మ్యాచ్‌లో 360 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కాగా, రెండో మ్యాచ్‌లో 79 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు మూడో మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ బాబర్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. సిడ్నీలో జరుగుతున్న టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 40 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేసి ఔటయ్యాడు. బాబర్ ఈ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో మొత్తం సిరీస్‌లో ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు.

బాబర్ ఆజం మొత్తం టెస్ట్ రికార్డ్ బాగుంది. 51 టెస్టుల్లో 3849 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతను 9 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలు సాధించాడు. బాబర్ అత్యుత్తమ టెస్టు స్కోరు 196 పరుగులుగా నిలిచింది.

మూడో టెస్టులోనూ ఓటమి దిశగా పాక్..

View this post on Instagram

A post shared by ICC (@icc)

కాగా, మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ తన రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. మొత్తంగా 82 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. మ్యాచ్‌లో మూడో రోజైన శుక్రవారం ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 116/2 స్కోరుతో నిలిచింది. మూడో రోజు రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా జట్టు 299 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ తరపున అమీర్ జమాల్ అత్యధికంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. కాగా, ఆస్ట్రేలియా తరఫున మార్నస్ లాబుషాగ్నే, మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీలు చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..