Youngest Players: చరిత్ర సృష్టించిన బీహార్ యువ క్రికెటర్.. సచిన్ టెండూల్కర్‌ రికార్డ్ బ్రేక్.. అదేంటంటే?

Ranji Trophy 2024: సూర్యవంశీ వినూ మన్కడ్ ట్రోఫీ - 2023లో కూడా పాల్గొన్నాడు. ఆ సమయంలో, అతను ఐదు మ్యాచ్‌ల్లో 393 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఇది కాకుండా, కూచ్ బెహార్ ట్రోఫీలో జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 151, 76 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ యువ క్రికెటర్ కేవలం ఆరేళ్ల వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించి ఏడేళ్ల వయసులో అకాడమీలో చేరాడు. మాజీ రంజీ క్రికెటర్ మనీష్ ఓజా వద్ద శిక్షణ తీసుకున్నాడు.

Youngest Players: చరిత్ర సృష్టించిన బీహార్ యువ క్రికెటర్.. సచిన్ టెండూల్కర్‌ రికార్డ్ బ్రేక్.. అదేంటంటే?
Vaibhav Suryavanshi
Follow us
Venkata Chari

|

Updated on: Jan 05, 2024 | 1:37 PM

Ranji Trophy 2024: బీహార్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) చరిత్ర సృష్టించాడు. కేవలం 14 ఏళ్లకే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. పాట్నాలో ముంబై, బీహార్ మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్ జరుగుతుండగా, ఈ మ్యాచ్‌లో 14 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కూడా బీహార్ తరపున ఆడుతున్నాడు.

వైభవ్ సూర్యవంశీ అసలు వయస్సు ఎంత అనేది పూర్తిగా స్పష్టంగా తెలియనప్పటికీ, అతను ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కులలో ఒకడిగా నిలిచాడు. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, సూర్యవంశీ వయస్సు 12 సంవత్సరాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అతను సెప్టెంబర్ 2023 నాటికి 14 ఏళ్లు నిండుతాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

భారత అండర్-19 బి జట్టు తరపున..

వైభవ్ సూర్యవంశీ కూడా భారత అండర్-19 బి జట్టులో భాగమయ్యాడు. ఈ జట్టు ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లతో చతుర్భుజ సిరీస్‌లలో పాల్గొంది. ఈ సిరీస్‌లో వైభవ్ ఐదు మ్యాచ్‌ల్లో 177 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ వచ్చింది.

ఇది కాకుండా, సూర్యవంశీ వినూ మన్కడ్ ట్రోఫీ – 2023లో కూడా పాల్గొన్నాడు. ఆ సమయంలో, అతను ఐదు మ్యాచ్‌ల్లో 393 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఇది కాకుండా, కూచ్ బెహార్ ట్రోఫీలో జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 151, 76 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ యువ క్రికెటర్ కేవలం ఆరేళ్ల వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించి ఏడేళ్ల వయసులో అకాడమీలో చేరాడు. మాజీ రంజీ క్రికెటర్ మనీష్ ఓజా వద్ద శిక్షణ తీసుకున్నాడు.

భారతదేశపు గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన సచిన్ టెండూల్కర్ కూడా 15 సంవత్సరాల వయస్సులో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..