AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రెండో పిచ్.. వాళ్లకు భయపడి సిద్ధం చేసిన ఐసీసీ.. ఎందుకంటే?

Australia vs India: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ లండన్‌లోని ఓవల్ మైదానంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమైంది. ఇంగ్లండ్‌లో కొనసాగుతున్న చమురు నిరసనల దృష్ట్యా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) డబ్ల్యుటీసీ ఫైనల్ కోసం రెండు పిచ్‌లను సిద్ధం చేసింది.

WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రెండో పిచ్.. వాళ్లకు భయపడి సిద్ధం చేసిన ఐసీసీ.. ఎందుకంటే?
Wtc Final London Picth
Venkata Chari
|

Updated on: Jun 07, 2023 | 4:55 PM

Share

WTC final 2023, Australia vs India: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ లండన్‌లోని ఓవల్ మైదానంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమైంది. ఇంగ్లండ్‌లో కొనసాగుతున్న చమురు నిరసనల దృష్ట్యా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) డబ్ల్యుటీసీ ఫైనల్ కోసం రెండు పిచ్‌లను సిద్ధం చేసింది. మీడియా నివేదికల ప్రకారం, నిరసనకారుల వల్ల పిచ్‌కు ఏదైనా నష్టం జరిగితే, WTC ఫైనల్ మ్యాచ్‌ను మరొక పిచ్‌లో ఆడవచ్చు.

ఈమేరకు ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. WTC ఫైనల్ కోసం మేం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. ఫలితం రావాలని కోరుకుంటున్నాం. మ్యాచ్‌లో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని కోరుకుంటున్నాం. ఇందుకోసం అన్ని విధాలా కృషి చేస్తున్నామంటూ పేర్కొంది. నిజానికి, ఇంగ్లండ్‌లో పర్యావరణం కోసం పనిచేస్తున్న జస్ట్ స్టాప్ ఆయిల్ అనే ఎన్జీవో కార్యకర్తలు ప్రదర్శన చేస్తున్నారు. ఈ నిరసన ప్రదర్శన కారణంగా, ఇంగ్లండ్‌లో జరుగుతున్న అనేక క్రీడా కార్యక్రమాలు ప్రభావితమయ్యాయి. ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్, ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్, ప్రీమియర్‌షిప్ రగ్బీ మ్యాచ్‌లు ప్రభావితమయ్యాయి.

మే 28న ట్వికెన్‌హామ్‌లో జరిగిన రగ్బీ ప్రీమియర్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో జస్ట్ ఆయిల్ నుంచి వచ్చిన నిరసనకారులు మైదానంలోకి దూసుకెళ్లారు . ఆపై నేలపై నారింజ రంగును విసిరారు. దీని కారణంగా సారాసెన్స్ వర్సెస్ సెయిల్ షార్క్స్ మధ్య ఫైనల్ 20 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది.

ఇవి కూడా చదవండి

ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్ సమయంలో టేబుల్‌పై వేసిన పెయింట్..

ఏప్రిల్‌లో జరిగిన ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్ సమయంలో కూడా, జస్ట్ ఆయిల్ కార్యకర్తలు టేబుల్‌లపైకి ఎక్కి టేబుల్‌లపై నారింజ రంగును పోశారు. దీంతో మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..