T20 Blast: 63 పరుగులకు 9 వికెట్లు.. నిప్పులు చెరుగుతోన్న రాజస్థాన్ ప్లేయర్.. ప్రత్యర్థుల డమాల్..

|

Jun 04, 2022 | 9:05 PM

ఐపీఎల్‌లో తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేసిన ఈ వెస్టిండీస్‌ ఆటగాడు మొత్తం 7 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు నేలకూల్చాడు. ఐపీఎల్‌లో అతని బౌలింగ్‌ సగటు 21.5 కావడం విశేషం.

T20 Blast: 63 పరుగులకు 9 వికెట్లు.. నిప్పులు చెరుగుతోన్న రాజస్థాన్ ప్లేయర్.. ప్రత్యర్థుల డమాల్..
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022 లో రాజస్థాన్ రాయల్స్  (Rajasthan Royals ) జట్టు అద్భుతంగా రాణించింది. 2008లో ఛాంపియన్‌గా నిలిచిన ఆ జట్టు మళ్లీ తొలిసారి తుది పోరుకు అర్హత సాధించింది. అయితే దురదృష్టవశాత్తూ ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓటమిపాలైంది. విజేతగా నిలవకపోయినప్పటికీ రాజస్థాన్‌ జట్టు ఈ సీజన్లో నిలకడ ఆటతీరును ప్రదర్శించింది. ఆటగాళ్లందరూ సమష్ఠిగా రాణించారు. అందులో వెస్టిండీస్‌కు చెందిన ఒబెడ్ మెక్‌కాయ్ (Obed McCoy)  ఒకరు. ఐపీఎల్‌లో తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేసిన ఈ వెస్టిండీస్‌ ఆటగాడు మొత్తం 7 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు నేలకూల్చాడు. ఐపీఎల్‌లో అతని బౌలింగ్‌ సగటు 21.5 కావడం విశేషం. కాగా ఐపీఎల్‌లో సత్తాచాటిన ఈ ఫాస్ట్ బౌలర్‌ ఇప్పుడు ఇంగ్లండ్‌లోనూ అదరగొడుతున్నాడు. టీ20 బ్లాస్ట్‌ టోర్నీలో భాగంగా ససెక్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఈ లెఫ్టార్మ్ సీమర్‌ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లో మొత్తం 9 వికెట్లు పడగొట్టడం గమనార్హం.

కాగా మెక్‌కాయ్‌ సూపర్‌ బౌలింగ్‌ కారణంగా టీ20 బ్లాస్ట్‌ టోర్నీలో ససెక్స్‌ వరుసగా రెండో విజయం సాధించింది. శుక్రవారం రాత్రి మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన మిడిల్‌సెక్స్‌ కేవలం 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. పొదుపుగా బౌలింగ్‌ చేసిన మెక్‌కాయ్ నాలుగు వికెట్లు తీశాడు. మొత్తం 4 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చిన ఒబెడ్‌ జాక్ డేవిస్ (14), మార్టిన్ అండర్సన్ (1), ల్యూక్ హోల్‌మన్ (5), టోబి రోలాండ్ జోన్స్ (1)లను పెవిలియన్‌కు పంపించాడు. అంతకు ముందు సోమర్‌సెట్‌పై కూడా ఐదు వికెట్లతో చెలరేగాడీ విండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌. తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

Namita: వేడుకగా హీరోయిన్‌ సీమంతం.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

Poco X4 GT: పోకో నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్‌ ఏంటో తెలుసా?

IND vs SA: రేపటి నుంచి విశాఖ టీ 20 మ్యాచ్‌ టికెట్ల విక్రయాలు.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే..