Virender Sehwag: తన జాబితాలో హార్దిక్ పాండ్యకు చోటివ్వని సెహ్వాగ్.. ముంబైలో ఆ ముగ్గురు ఉండే అవకాశం ఉందంటూ వ్యాఖ్యలు..

వచ్చే ఐపీఎల్ వేలంలో ముగ్గిరిని మాత్రమే తిరిగి తీసుకునే నిబంధన ఉందని ఊహగానాలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ముంబై ప్రాంచైజీ ఎవరిని తిరిగి తీసుకుంటుందన్న దానిపై  ఇప్పుడే చర్చ మొదలైంది...

Virender Sehwag: తన జాబితాలో హార్దిక్ పాండ్యకు చోటివ్వని సెహ్వాగ్.. ముంబైలో ఆ ముగ్గురు ఉండే అవకాశం ఉందంటూ వ్యాఖ్యలు..
Hardik
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 10, 2021 | 2:49 PM

వచ్చే ఐపీఎల్ వేలంలో ముగ్గిరిని మాత్రమే తిరిగి తీసుకునే నిబంధన ఉందని ఊహగానాలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ముంబై ప్రాంచైజీ ఎవరిని తిరిగి తీసుకుంటుందన్న దానిపై  ఇప్పుడే చర్చ మొదలైంది. ప్రస్తుతం ముంబై టీంలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, కీరాన్ పొలార్డ్, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, డికాక్, పీయుష్ చావ్లా తదితరులు ఉన్నారు. అయితే వచ్చే సిజన్‎లో వీరిలో ముగ్గురే ఆ జట్టులో మళ్లీ ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఐపీఎల్ మెగా వేలం నియమాలు ఇంకా ప్రకటించబడలేదు. ప్రతి ఫ్రాంచైజీ గరిష్ఠంగా ముగ్గురు ఆటగాళ్లను తిరిగి నిలుపుకోవడానికి అనుమతి ఉందని ఊహగానాలపై భారత మాజీ భారత మాజీ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. ఒకవేళ ముగ్గురిని తీసుకునే నిబంధన ఉంటే ‘ఆల్ రౌండర్’ హార్దిక్ పాండ్యను మినహాయించి కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముంబై తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.

“నేను ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాను నిలుపుకుంటాను. సుదీర్ఘకాలం పాటు ఇషాన్ ఆడేందుకు అవకాశం ఉంది. హార్దిక్ పాండ్య బౌలింగ్ చేయకపోతే వేలంలో పెద్ద మొత్తంలో అమ్ముడుపోతాడని అనుకోవడం లేదు. గాయాల కారణంగా “హార్దిక్ ఈ సీజన్‌లో బౌలింగ్ చేయలేదు” అని అన్నారు. వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఎడిషన్‌కు ముందు మెగా వేలం జరగనుంది.  అయితే వచ్చే సీజన్ నుంచి రెండు కొత్త ఫ్రాంచైజీలు రానున్నాయి. రెండు కొత్త IPL జట్ల కొనుగోలు కోసం బీసీసీఐ ఇప్పటికే టెండర్స్ ఆహ్వానించింది. రెండు కొత్త జట్ల ఎంపిక కోసం గౌహతి, రాంచీ, కటక్ (ఆల్ ఈస్ట్), అహ్మదాబాద్ (పశ్చిమ), లక్నో (సెంట్రల్ జోన్), ధర్మశాల (నార్త్) ఆరు నగరాలను బోర్డు పరిశీలిస్తోంది.

Read Alo.. Piyush Chawla: టీ20ల్లో పీయుష్‌ చావ్లా సరికొత్త రికార్డ్..! ఏంటో తెలుసుకోండి..