AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: భారత్‎తో పోరుపై పాక్ వికెట్ కీపర్ స్పందన.. హైప్ క్రియేట్ చేస్తున్నారని వ్యాఖ్యలు..

భారత్, పాకిస్తాన్ మ్యాచ్‎పై సోషల్ మీడియా, అభిమానులు హైప్ క్రియేట్ చేస్తున్నారని పాకిస్తాన్ వికెట్ కీపర్, బ్యాట్స్‎మెన్ మొహమ్మద్ రిజ్వాన్ శనివారం అన్నారు. అక్టోబర్ 24న టీ20 వరల్డ్ కప్‎లో పాకిస్తాన్‎తో భారత్ తలపడనుంది...

T20 World Cup: భారత్‎తో పోరుపై పాక్ వికెట్ కీపర్ స్పందన.. హైప్ క్రియేట్ చేస్తున్నారని వ్యాఖ్యలు..
Riwjan
Srinivas Chekkilla
|

Updated on: Oct 10, 2021 | 1:40 PM

Share

భారత్, పాకిస్తాన్ మ్యాచ్‎పై సోషల్ మీడియా, అభిమానులు హైప్ క్రియేట్ చేస్తున్నారని పాకిస్తాన్ వికెట్ కీపర్, బ్యాట్స్‎మెన్ మొహమ్మద్ రిజ్వాన్ శనివారం అన్నారు. అక్టోబర్ 24న టీ20 వరల్డ్ కప్‎లో పాకిస్తాన్‎తో భారత్ తలపడనుంది. “ఈ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‎ను మేము ఆటలాగే చూస్తున్నామని” అన్నారు. సోషల్ మీడియా, అభిమానులు హైప్ క్రియేట్ చేస్తున్నారని.. ఇంది మంచిదే.. కానీ దీని వల్ల ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతుందని వర్చువల్‎గా జరిగిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. యుఏఈ గడ్డపై పాకిస్తాన్ చాలా మ్యాచ్‎లు అడిందని.. భారత్‎తో మ్యాచ్‎తో పాక్‎దే పై చేయి అవుతుందని అనడాన్ని అతను తోసిపుచ్చారు.

2021 టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 17న ప్రారంభం కానుంది. ఫైనల్ నవంబర్ 14 న జరుగుతుంది. క్వాలిఫయర్ రౌండ్ 2021 అక్టోబర్ 17 న ప్రారంభమై అక్టోబర్ 22న ముగుస్తుంది. మరుసటి రోజు నుండి అంటే అక్టోబర్ 23 సూపర్ 12 రౌండ్ ప్రారంభమవుతుంది. ఈ రౌండ్ నవంబర్ 8న ముగుస్తుంది. నాకౌట్ రౌండ్ నవంబర్ 10న ప్రారంభమవుతుంది. మొదటి సెమీఫైనల్ 10న అబుదాబిలో జరగనుంది. రెండో సెమీ ఫైనల్ దుబాయ్‌లో నవంబర్ 11న జరుగుతుంది. ఈ రెండు సెమీ-ఫైనల్స్‌కు రిజర్వ్ డే ఉంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు ఇప్పుటికే చాలా జట్లు యూఏఈ చేరుకున్నాయి. భారత ఆటగాళ్లు ఇప్పటికే అక్కడ ఐపీఎల్ ఆడుతున్నారు.

భారత జట్టులో విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (vc), KL రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (wk), ఇషాన్ కిషన్ (wk), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ. స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ ఉన్నారు.

భారత్ ఆడబోయే మ్యాచులు

24 అక్టోబర్ 2021: ఇండియా వర్సెస్ పాకిస్థాన్, 7:30 PM, దుబాయ్

31 అక్టోబర్ 2021 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, 7:30 PM, దుబాయ్

3 నవంబర్ 2021 ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, 7:30 PM, అబుదాబి

5 నవంబర్ 2021 ఇండియా వర్సెస్ B1, 7:30 PM, దుబాయ్

8 నవంబర్ 2021 ఇండియా వర్సెస్ A2, 7:30 PM దుబాయ్

Read Also..  PL 2021, DC vs CSK Preview, Records: 40 ఏళ్ల గురువుపై 24 ఏళ్ల శిష్యుడి పోరాటం.. ఇరుజట్ల బలాలు, రికార్డులు ఎలా ఉన్నాయంటే?