AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: బౌండరీ లైన్‌లో అద్భుత క్యాచ్ పట్టిన కివీస్ ప్లేయర్.. నువ్ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు.. వైరలవుతోన్న వీడియో

Nathan Smith: న్యూజిలాండ్ దేశవాళీ టీ20 లీగ్‌లో యువ బౌలర్ నాథన్ స్మిత్ ఆశ్చర్యకరమైన క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch Video: బౌండరీ లైన్‌లో అద్భుత క్యాచ్ పట్టిన కివీస్ ప్లేయర్.. నువ్ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు.. వైరలవుతోన్న వీడియో
New Zealand Cricketer Nathan Smith
Venkata Chari
|

Updated on: Nov 27, 2021 | 1:29 PM

Share

Viral Video: న్యూజిలాండ్ దేశవాళీ టీ20 లీగ్‌లో యువ బౌలర్ నాథన్ స్మిత్ ఆశ్చర్యకరమైన క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బౌండరీ లైన్‌లో గాలిలోకి ఎగిరి మరీ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌ని చూసి అభిమానులు – ఫెంటాస్టిక్, సూపర్, అద్బుతమంటు కామెంట్లు చేస్తున్నారు.

న్యూజిలాండ్ సూపర్ స్మాష్ డొమెస్టిక్ టీ20 లీగ్‌లో నాథన్ ఈ క్యాచ్‌ని అందుకున్నాడు. శుక్రవారం కాంటర్‌బరీ వర్సెస్ వెల్లింగ్‌టన్‌ మధ్య మ్యాచ్‌‌లో సూపర్ క్యాచ్ పట్టుకున్నాడు. లీగ్‌లో వెల్లింగ్టన్ వర్సెస్ కాంట్‌బరీ మొదటి మ్యాచ్ ఆడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్లింగ్టన్ జట్టు 177 పరుగులు చేసింది. దీని తర్వాత కాంట్‌బరీ బృందం ఛేజింగ్‌కు వచ్చింది.

ఓపెనర్ చాట్ బోజ్, కేన్ మెక్‌క్లూర్ క్రీజులో ఉన్నారు. వెల్లింగ్‌టన్‌ ఆటగాడు హమీష్‌ బెన్నెట్‌ వేసిన తొలి ఓవర్‌లో స్కోరు కేవలం ఒక పరుగు మాత్రమే వచ్చింది. బెన్నెట్ మెక్‌క్లూర్‌ను హైస్పీడ్ డెలివరీతో లెగ్-స్టంప్‌పై సంధించాడు. దీనిని మెక్‌క్లూర్ షాట్ ఆడాడు. మెక్‌క్లూర్ కొట్టిన షాట్ ఫైనల్ లెగ్ బౌండరీ దాటి వెళుతున్నట్లు అనిపించింది. అక్కడ నిలబడిన స్మిత్ బంతిని క్యాచ్ చేసి బౌండరీ లోపలికి విసిరి గాలిలోకి ఎగిరి క్యాచ్ పట్టుకున్నాడు.

స్మిత్ ఈ అద్భుతమైన క్యాచ్ ఫీల్డింగ్ యూనిట్‌లో ఉత్సాహాన్ని నింపింది. 1 పరుగుకే ఒక వికెట్ కోల్పోయిన కాంటర్బరీ జట్టు.. ఇక ఏ దశలోనూ కోలుకోలేక 20 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో నాథన్ స్మిత్ 2 వికెట్లు తీశాడు. నాథన్ ఈ అద్భుతమైన క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పడంలో గణనీయంగా దోహదపడింది.

ఫాస్ట్ బౌలర్ నాథన్ పిచ్ నుంచి బౌన్స్ పొందడంలో ప్రసిద్ధి చెందాడు. అతను 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 71 వికెట్లు పడగొట్టాడు. 2.71 ఎకానమీ రేటును కలిగి ఉన్నాడు. ఒక మ్యాచ్‌లో 3 సార్లు 5 కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. 23 టీ20 మ్యాచుల్లో 30 వికెట్లు తీశాడు.

Also Read: MS Dhoni To Virat Kohli: ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకునేది వీరినేనా.. మెగా వేలానికి ముందే వెలుగులోకి వచ్చిన లిస్ట్.. టాప్ 5లో ఎవరున్నారంటే?

IPL 2022 Mega Auction: వాళ్లు పిచ్చోల్లా ఏంటి? మరో మూడేళ్లు సారథిగా ధోని వద్దంటూ ఘాటు వ్యాఖ్యలు.. సీఎస్‌కే‌ను ఏకి పారేస్తున్న నెటిజన్లు!