IPL 2022 Mega Auction: ఆ యంగ్ ప్లేయర్‌పై కన్నేసిన ముంబై ఇండియన్స్.. మెగా వేలంలో కనక వర్షం కురిపించేందుకు సిద్ధం..!
Mumbai Indians: ఐపీఎల్ 2022 మెగా వేలం డిసెంబర్‌లో జరగనుంది. నవంబర్ 30లోగా రిటైన్ చేసుకునే నలుగురు ఆటగాళ్ల జాబితాను ఫ్రాంఛైజీలు బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది.
Shreyas Iyer: ఐపీఎల్ 2022 మెగా వేలం డిసెంబర్‌లో జరగనుంది. నవంబర్ 30లోగా రిటైన్ చేసుకునే నలుగురు ఆటగాళ్ల జాబితాను ఫ్రాంఛైజీలు బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వేలానికి వెళ్లనున్నట్లు ఇప్పటికే తెలిపాడు. అయ్యర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అయ్యర్‌పై ముంబై ఇండియన్స్ కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. శ్రేయాస్ అయ్యర్‌ను రిటైన్ చేర్చుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. అయ్యర్ ముంబైకి చెందినవాడే కావడంతో అతనిని ఈ సారి జట్టులో చేర్చూకోవాలని భావిస్తోంది. అదే సమయంలో కాన్పూర్ టెస్టులో అయ్యర్ సెంచరీ చేయడంతో మిగతా జట్ల చూపు కూడా అతనిపైనే నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో మెగా వేలంలో అయ్యర్ పై కాసుల వర్షం కురిపించేందుకు పలు జట్లు సిద్ధమయ్యాయి.
ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం, శ్రేయాస్ అయ్యర్‌ను లక్నో, అహ్మదాబాద్ టీంలు కూడా సంప్రదించాయి. ముంబై ఇండియన్స్ కూడా తమ జట్టులో శ్రేయాస్ అయ్యర్‌ను చేర్చుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. శ్రేయాస్ అయ్యర్ ముంబై నుంచి వచ్చాడని, అదే సమయంలో అతను భవిష్యత్తు దృష్టిలో మంచి కెప్టెన్ అని కూడా పేర్కొంది.
కొత్త జట్టుతో కేఎల్ రాహుల్.. కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్‌తో తన ప్రయాణాన్ని ముగించుకుంటున్నాడు. అతను లక్నో జట్టులో చేరవచ్చని సమాచారం. లక్నో జట్టుకు రాహుల్ సారథ్యం వహిస్తారని విశ్వసనీయ సమాచారం. రాహుల్‌తో పాటు శిఖర్ ధావన్ కూడా లక్నో, అహ్మదాబాద్ జట్టుపై కన్నేశాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌లో ఎవరంటే.. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిని అట్టిపెట్టుకోవాలని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు భావిస్తోంది. వెంకటేష్ అయ్యర్ ప్రస్తుతం పరిశీలనలో ఉన్నప్పటికీ, శుభ్మన్ గిల్, ఆండ్రీ రస్సెల్ వంటి ఆటగాళ్లు కూడా వారి దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్‌లో మెగా వేలం.. ఈసారి రెండు కొత్త జట్లు ఐపీఎల్‌లో చేరాయి. ఒక్కో జట్టు మొత్తం 4 మంది ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. గరిష్ఠంగా ముగ్గురు భారతీయ ఆటగాళ్లు, గరిష్టంగా ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉంచుకునే ఛాన్స్ ఉంది. నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అయ్యే ఖర్చు రూ. 42 కోట్లుగా ఉండాలని బీసీసీఐ పేర్కొంది. వేలంలో ఒక జట్టు ఆటగాళ్ల కోసం మొత్తంగా రూ. 90 కోట్లు ఖర్చు చేయాలని పేర్కొంది. ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లు నవంబర్ 30లోగా రిటైన్ చేసుకునేందుకు నలుగురు ఆటగాళ్ల పేర్లను సమర్పించాలి. అదే సమయంలో, రెండు కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్ డిసెంబర్ 1 నుంచి 25 వరకు ముగ్గురు ఆటగాళ్లను చేర్చుకోవచ్చని బీసీసీఐ పేర్కొంది.