IND vs NZ 1st Test, Day 3: మూడో రోజు ఆధిపాత్యాన్ని ప్రదర్శించిన భారత బౌలర్లు.. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో..

IND vs NZ 1st Test, Day 3: కాన్పూర్‌ వేదికగా జరుగుతోన్న తొలి టెస్ట్‌ మూడో రోజు టీమిండియా ఆధిపాత్యాన్ని ప్రదర్శించింది. భారత్‌ ఇచ్చిన లక్ష్యాన్ని చేధించే క్రమంలోనే...

IND vs NZ 1st Test, Day 3: మూడో రోజు ఆధిపాత్యాన్ని ప్రదర్శించిన భారత బౌలర్లు.. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో..
Ind Vs Nz 3rd Day
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 27, 2021 | 5:11 PM

IND vs NZ 1st Test, Day 3: కాన్పూర్‌ వేదికగా జరుగుతోన్న తొలి టెస్ట్‌ మూడో రోజు టీమిండియా ఆధిపాత్యాన్ని ప్రదర్శించింది. భారత్‌ ఇచ్చిన లక్ష్యాన్ని చేధించే క్రమంలోనే బరిలోకి దిగిన కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ రెండో రోజు ధాటిగా ఆడిన విషయం తెలిసిందే. అయితే మూడో రోజు (శనివారం) మాత్రం ఆశించిన స్థాయిలో ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే మూడో రోజు ఆట ప్రారంభించిన మొదటి నుంచే వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఇలా 296 పరుగలకే ఆలౌట్‌ అయ్యింది. దీంతో 49 పరుగుల వెనుకంజలోనే కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ ప్యాకప్‌ అయ్యారు. అయితే కివీస్‌ను కట్టడి చేసిన టీమిండియా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభంలోనే తడబడింది.

మ్యాచ్‌ ప్రారంభమయ్యే కొన్ని క్షణాలకే తొలి దెబ్బ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ కేవలం 1 పరుగువద్దే జేమీసన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 14 పరగులు చేసింది. ఇలా టీమిండియా ప్రస్తుతం 63 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే అంతకు ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ 296 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. దీంతో 49 పరుగుల వెనుకంజలో ఉండిపోయింది. ఇక కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ విషయానికొస్తే.. టామ్‌ లాథమ్‌ 95 పరుగులు, విల్‌ యంగ్‌ 89 పరుగులతో రాణించగా మిగతా వారు చాలా తక్కువ స్కోరుకు పెవిలియన్‌ బాట పట్టారు. భారత బౌలర్లలో అక్సర్‌ పటేల్‌ ఏకంగా 5 వికెట్లు పడగొట్టి కివీస్‌ను దెబ్బగొట్టాడు. ఇక అశ్విన్‌ మూడు వికెట్లు తీసుకోగా, ఉమేష్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా చేరో వికెట్‌ పడగొట్టారు.

Also Read: AP Asha Worker Jobs: ఏపీలోని కడప జిల్లాలో ఆశా వర్కర్‌ పోస్టులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

Radish Leaves Benefits: ముల్లంగి ఆకుల జ్యూస్ తాగితే.. బరువు తగ్గడం ఖాయం.. ఇంకా ఎన్నో లాభాలు..

Golgappa Machine: పానీ పూరీ అమ్ముతున్న రోబో.. స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఢిల్లీకి చెందిన వ్యక్తి..