- Telugu News Photo Gallery Cricket photos IPL 2022 Mega Auction: Top five ipl players to be retained ahead of IPL 2022 mega auction, check here full details
MS Dhoni To Virat Kohli: ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకునేది వీరినేనా.. మెగా వేలానికి ముందే వెలుగులోకి వచ్చిన లిస్ట్.. టాప్ 5లో ఎవరున్నారంటే?
IPL 2022: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న IPL 2022 మెగా వేలానికి రంగం సిద్ధమైంది. IPL ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల లిస్టును బీసీసీఐకి సమర్పించేందుకు నవంబర్ 30 వరకు గడువు ఉంది.
Updated on: Nov 27, 2021 | 11:29 AM

IPL 2022: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న IPL 2022 మెగా వేలానికి రంగం సిద్ధమైంది. IPL ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల లిస్టును బీసీసీఐకి సమర్పించేందుకు నవంబర్ 30 వరకు గడువు ఉంది. దీని తరువాత అధికారిక ప్రకటన రానుంది. ముఖ్యంగా, IPL 2022లో రెండు కొత్త జట్లు పాల్గొంటాయి. 15వ ఎడిషన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి లక్నో, అహ్మదాబాద్‌లు కూడా పోటీపడతాయని బీసీసీఐ అక్టోబర్ 25న ప్రకటించింది. క్యాష్ రిచ్ లీగ్‌లో రెండు కొత్త జట్లు పోటీపడనున్నాయి. కాబట్టి IPL 2022కి ముందే మెగా వేలం నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.

IPL 2022 Retention Players List

విరాట్ కోహ్లీ: ఎన్‌డీటీవీ నివేదికల ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి సేవలను కొనసాగించడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా, ఐపీఎల్ 2021 తర్వాత కోహ్లి ఆర్‌సీబీ కెప్టెన్సీని విడిచిపెట్టాడు. అయితే, అతను ఆర్‌సీబీ బ్యాటింగ్ బాధ్యతలను భుజానకెత్తుకుంటాడని భావిస్తున్నారు. 33 ఏళ్ల ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కావడం గమనార్హం. అతను గత సీజన్‌లో 405 పరుగులు పూర్తి చేశాడు. ఆర్‌సీబీలో 3వ అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచాడు.

సంజు శాంసన్: కేరళ వికెట్ కీపర్ కం బ్యాటర్ రూ. 14 కోట్లతో రిటైన్ చేసుకోవడానికి రాజస్థాన్ రాయల్స్ సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాబోయే 2022 సీజన్‌కు కూడా కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ను కొనసాగించునుందని తెలుస్తోంది. 27 ఏళ్ల శాంసన్ రాయల్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా కొనసాగుతాడని ESPNcricinfo వెబ్‌సైట్ నివేదించింది. శాంసన్ 2018లో రూ. 8 కోట్లతో రాయల్స్‌లో చేరాడు.

రోహిత్ శర్మ: నివేదికల ప్రకారం, ఐదుసార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఇషాన్ కిషన్, జస్‌ప్రీత్ బుమ్రాలను కూడా ఉంచుకోవాలని ఫ్రాంచైజీ నిర్ణయించింది.

రిషబ్ పంత్: ఈఎస్‌పీఎన్ నివేదిక ప్రకారం, IPL 2021లో ఢిల్లీ క్యాపిటల్స్(DC)కి కెప్టెన్‌గా వ్యవహరించి, ప్లేఆఫ్స్ దశకు తీసుకెళ్లిన వికెట్ కీపర్ కం బ్యాటర్ రిషబ్ పంత్‌తో సహా నలుగురు ఆటగాళ్లను ఢిల్లీ క్యాపిటల్స్ ఉంచుకుంటుంది. కెప్టెన్‌గా పంత్‌పై డీసీ విశ్వాసం కొనసాగిస్తారని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది.

ఎంఎస్ ధోని: డిఫెండింగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ టీ20 లీగ్ తదుపరి మూడు సీజన్లకు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కొనసాగించాలని నిర్ణయించుకుంది. ధోనితో పాటు సీఎస్‌కే 2021 IPL టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌లను ఫ్రాంచైజీ తన వద్ద ఉంచుకోనుంది.





























