Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Mega Auction: వాళ్లు పిచ్చోల్లా ఏంటి? మరో మూడేళ్లు సారథిగా ధోని వద్దంటూ ఘాటు వ్యాఖ్యలు.. సీఎస్‌కే‌ను ఏకి పారేస్తున్న నెటిజన్లు!

IPL 2022: మూడు సంవత్సరాలు ఎందుకు భయ్యా.. వచ్చే ఏడాదికి మాత్రమే ఆయనను సారథిగా ఉంచండంటూ నెటిజన్లు సీఎస్‌కేను ఏకిపారేస్తున్నారు.

IPL 2022 Mega Auction: వాళ్లు పిచ్చోల్లా ఏంటి? మరో మూడేళ్లు సారథిగా ధోని వద్దంటూ ఘాటు వ్యాఖ్యలు.. సీఎస్‌కే‌ను ఏకి పారేస్తున్న నెటిజన్లు!
Follow us
Venkata Chari

|

Updated on: Nov 27, 2021 | 10:45 AM

IPL 2022 Mega Auction: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ కెప్టెన్ ఎంఎస్ ధోనిని మరో మూడేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి నిర్ణయాలతో నెటిజన్లు మాత్రం గుర్రుగా ఉన్నారు. చాలా మంది CSK చర్యను ‘ఆత్మహత్య’ గా పిలుస్తున్నారు. మరికొందరు మూడు సంవత్సరాలు కాకుండా కేవలం ఒక సంవత్సరం పాటు సారథిగా ఉంచుకోవాలని ఫ్రాంచైజీని కోరతూ ట్వీట్లు చేస్తున్నారు.

ధోని ఈ సంవత్సరం IPLలో CSKకి నాల్గవ టైటిల్‌ను అందించిన విషయ తెలిసిందే. అయితే ఇప్పటికే ధోనికి 40 ఏళ్లు నిండిపోయాయని, మరో మూడు సీజన్‌లకు సారథిగా ఉంచుకోవడం పెద్ద తప్పు అని భావిస్తున్నారు.

బీసీసీఐ రిటెన్షన్ పాలసీ ప్రకారం, ఫ్రాంఛైజీలు కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునేందుకు అనుమతి ఉంది. నవంబర్ 30లోగా జట్లు తుది జాబితాను సమర్పించాల్సి ఉంటుంది.

నెటిజన్ల స్పందనలు..

Also Read: IND vs NZ: నా అరంగేట్రానికి మద్దతిచ్చిన అతనికి రుణపడి ఉంటాను: శ్రేయాస్ అయ్యర్

Watch Video: క్రికెట్ చరిత్రలో తీరని విషాదం.. 25 ఏళ్లకే మరణించిన క్రికెటర్.. చిన్న వయసులోనే రికార్డులు నెలకొల్పి.. దుఖాన్ని మిగిల్చాడు..!