IND vs NZ: నా అరంగేట్రానికి మద్దతిచ్చిన అతనికి రుణపడి ఉంటాను: శ్రేయాస్ అయ్యర్
Shreyas Iyer-Surya Kumar Yadav: శ్రేయాస్ అయ్యర్ తొలి టెస్టులో 171 బంతుల్లో 105 పరుగులు చేసి అరంగేట్రంలోనే సెంచరీ చేసిన 16వ భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
India vs New Zealand: కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో తన టెస్ట్ అరంగేట్రంలో ఆకట్టుకునే సెంచరీని సాధించిన భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్, శుక్రవారం 2వ రోజు ఆట తర్వాత తన గ్రీన్ పార్క్ కనెక్షన్‌ను గుర్తుచేసుకున్నాడు. BCCI.tvలో కాన్పూర్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి మాట్లాడాడు. అయ్యర్ 2014లో రంజీ ట్రోఫీలో ఇదే వేదికపై అరంగేట్రం చేసిన తన మొదటి ఆటను గుర్తుచేసుకున్నాడు. అయ్యర్ తన సహచర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌తో ముచ్చటించాడు. అయితే రంజీలో సూర్య కమార్ యాదవ్ తనకు ఎంతో అండగా నిలిచాడని, ఫాంలో లేకపోయినా తనపై ఎంతో నమ్మకం ఉంచాని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా సూర్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున 2018 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సమయంలో అయ్యర్ 40 బంతుల్లో 93 పరుగులు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
“కాన్పూర్ స్టేడియం నాకు నిజంగా అదృష్టమైంది. నా తొలి రంజీ సీజన్ సూర్యకుమార్ కెప్టెన్‌షిప్‌లో ఆడాను. నా మొదటి నాలుగు ఇన్నింగ్స్‌ల తర్వాత నాకు మద్దతు ఇచ్చినందుకు అతనికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను జట్టుకు దూరంగా ఉంటానని అనుకున్నాను. కానీ, కాన్పూర్‌లో నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చాడు. అయితే ఈ మ్యాచులో చాలా కఠిన పరిస్థితుల్లో మా జట్టు పడిపోయింది. 5 వికెట్లకు 20 లేదా 30 పరుగులతో కష్టాల్లో పడ్డాం. ఆసమయంలో నేను బ్యాటింగ్‌కు వచ్చాను. ఆపై నేను టెయిల్ ఎండర్స్‌తో 150 పరుగుల భాగస్వామ్యాన్ని చేసి జట్టుకు మంచి స్థానానికి చేర్చాను. IPLలో కూడా నేను ఇక్కడ 93 పరుగులు చేశాను. దీంతో కాన్పూర్ క్రికెట్ గ్రౌండ్స్ నా లక్కీగా మారింది” అని పేర్కొన్నాడు.
బీసీసీఐ తమ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ ఇంటర్వ్యూను పంచుకుంది. సూర్య కుమార్, శ్రేయస్‌ను కౌగిలించుకుని, సెంచరీ సాధించినందుకు శుభాకాంక్షలు కూడా తెలిపాడు. సూర్య సహచరుడు సెంచరీ కొట్టినప్పడు చాలా సంతోషంగా కనిపించాడు. సూర్యకుమార్ కూడా టెస్టు జట్టులో ఉన్నాడు. కానీ, ప్లేయింగ్ XIలో చోటు దక్కలేదు. రాహుల్ గాయంతో టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో అయ్యర్‌కు అరంగేట్రం చేసే ఛాన్స్ వచ్చింది. అప్పటి వరకు అయ్యర్ బ్యాకప్ మిడిల్ ఆర్డర్ ఎంపికగా ఉన్నాడు. శుభమాన్ గిల్ భారతదేశం తరపున 5వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.
రెండు టెస్టుల సిరీస్ నుంచి రాహుల్ నిష్క్రమించడంతో, గిల్, మయాంక్ అగర్వాల్‌లతో భారత్ ఓపెనింగ్ ప్రారంభించారు. దీంతో అయ్యర్‌కు తొలి టెస్ట్ క్యాప్ అందజేశారు. తొలి టెస్టులో 171 బంతుల్లో 105 పరుగులు చేసి అరంగేట్రంలోనే సెంచరీ చేసిన 16వ భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
He gave Shreyas a hug ?, he clapped for him ?, he was one of the happiest when his mate scored a hundred ?.
This interview of @ShreyasIyer15 with @surya_14kumar is all heart. ? ? – By @28anand
Full interview ? ? #TeamIndia #INDvNZ @Paytm https://t.co/CR0rOtTXiu pic.twitter.com/y1cFU18qB5
— BCCI (@BCCI) November 26, 2021