IND vs NZ 1st Test, Day 3 Highlights: ముగిసిన మూడో రోజు ఆట.. స్కోర్ వివరాలు ఇలా ఉన్నాయి..

|

Updated on: Nov 27, 2021 | 6:48 PM

IND vs NZ 1st Test, Day 3 Highlights: భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగుల స్కోరు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన కివీ జట్టు వికెట్ కోల్పోకుండా అద్భుతంగా పోరాడుతోంది.

IND vs NZ 1st Test, Day 3 Highlights: ముగిసిన మూడో రోజు ఆట.. స్కోర్ వివరాలు ఇలా ఉన్నాయి..
Ind Vs Nz

IND vs NZ, Live, 1st Test, Day 3: మూడో రోజు టెస్ట్‌ మ్యాచ్‌ ముగిసే సమయానికి టీమిండియా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ కోల్పోయి 14 పరగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పుజారా (9), అగర్వాల్‌ (4) పరుగులతో ఉన్నారు. టీమిండియా 63 పరుగుల ఆధిపత్యంలో ముందుకు వెళుతోంది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ వరుస వికెట్లను కోల్పోయి. టీమిండియా ఇచ్చిన 345 పరుగలను కూడా అందుకోలక పోయింది. భారత బౌలర్లు రాణించడంతో.. 296 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. ఇక టీమిండియా ఇచ్చిన 345 పరుగలను బీట్‌ చేయలేక 49 పరుగుల వెనుకంజలో మిగిలిపోయింది.

ఇదిలా ఉంటే.. భారత బౌలర్ల ధాటికి కీవిస్‌ బ్యాట్స్‌మెన్‌ తట్టుకోలేక పోయారు. రెండోరోజు ఒక వికెట్‌ కూడా కోల్పోకుండా అద్భుత ఆటతీరును కనబరిచిన కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ మూడో రోజు (శనివారం) మాత్రం వరుసగా వికెట్లను సమర్పించుకున్నారు. వరుస పెట్టి పెవిలియన్‌ బాట పట్టారు. దీంతో 296 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. ఇక టీమిండియా ఇచ్చిన 345 పరుగలను బీట్‌ చేయలేక 49 పరుగుల వెనుకంజలో ఉండిపోయింది. ఇక న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్స్‌లో టామ్‌ లాథమ్‌ 95 పరుగులు, విల్‌ యంగ్‌ 89 పరుగులతో రాణించగా మిగతా వారు చాలా తక్కువ స్కోరుకు పెవిలియన్‌ బాట పట్టారు. దీంతో న్యూజిలాండ్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఇక భారత బౌలర్ల విషయానికొస్తే అక్సర్‌ పటేల్‌ చెలరేగిపోయాడు ఏకంగా 5 వికెట్లు పడగొట్టి కివీస్‌ను దెబ్బగొట్టాడు. ఇక అశ్విన్‌ మూడు వికెట్లు తీసుకోగా, ఉమేష్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా చేరో వికెట్‌ పడగొట్టారు. భారత్ 345 పరుగులు చేసింది తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 345 పరుగులు చేసింది. ఈ మ్యాచుతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన శ్రేయాస్ అయ్యర్ 105 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ 52, రవీంద్ర జడేజా 50 పరుగులు సాధించారు.

రెండో రోజు విఫలమైన భారత బౌలర్లు.. రెండో రోజు భారత ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే, న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. స్వదేశంలో కివీస్‌కి శుభారంభం లభించింది. భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 27 Nov 2021 04:36 PM (IST)

    ముగిసిన మూడో రోజు..

    మూడో రోజు టెస్ట్‌ మ్యాచ్‌ ముగిసే సమయానికి టీమిండియా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ కోల్పోయి 14 పరగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పుజారా (9), అగర్వాల్‌ (4) పరుగులతో ఉన్నారు. టీమిండియా 63 పరుగుల ఆధిపత్యంలో ముందుకు వెళుతోంది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ వరుస వికెట్లను కోల్పోయి. టీమిండియా ఇచ్చిన 345 పరుగలను కూడా అందుకోలక పోయింది. భారత బౌలర్లు రాణించడంతో.. 296 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. ఇక టీమిండియా ఇచ్చిన 345 పరుగలను బీట్‌ చేయలేక 49 పరుగుల వెనుకంజలో మిగిలిపోయింది.

  • 27 Nov 2021 04:20 PM (IST)

    తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌..

    సెకండ్ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన కొద్దిసేపటికే టీమిండియా తొలి వికెట్‌ను కోల్పోయింది. రెండు పరుగుల వద్దే జమీసన్‌ బౌలింగ్‌లో శుభమ్‌ గిల్‌ బౌల్డ్‌ రూపంలో పెవిలియన్‌ బాట పట్టాడు. ప్రస్తుతం టీమిండియా 55 పరుగల లీడ్‌తో కొనసాగుతోంది.

  • 27 Nov 2021 04:02 PM (IST)

    భారత్‌ బౌలర్ల ధాటికి కివీస్‌ విల విల..

    భారత బౌలర్ల ధాటికి కీవిస్‌ బ్యాట్స్‌మెన్‌ తట్టుకోలేక పోయారు. రెండోరోజు ఒక వికెట్‌ కూడా కోల్పోకుండా అద్భుత ఆటతీరును కనబరిచిన కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ మూడో రోజు (శనివారం) మాత్రం వరుసగా వికెట్లను సమర్పించుకున్నారు. వరుస పెట్టి పెవిలియన్‌ బాట పట్టారు. దీంతో 296 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. ఇక టీమిండియా ఇచ్చిన 345 పరుగలను బీట్‌ చేయలేక 49 పరుగుల వెనుకంజలో ఉండిపోయింది. ఇక న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్స్‌లో టామ్‌ లాథమ్‌ 95 పరుగులు, విల్‌ యంగ్‌ 89 పరుగులతో రాణించగా మిగతా వారు చాలా తక్కువ స్కోరుకు పెవిలియన్‌ బాట పట్టారు. దీంతో న్యూజిలాండ్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఇక భారత బౌలర్ల విషయానికొస్తే అక్సర్‌ పటేల్‌ చెలరేగిపోయాడు ఏకంగా 5 వికెట్లు పడగొట్టి కివీస్‌ను దెబ్బగొట్టాడు. ఇక అశ్విన్‌ మూడు వికెట్లు తీసుకోగా, ఉమేష్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా చేరో వికెట్‌ పడగొట్టారు.

  • 27 Nov 2021 03:48 PM (IST)

    మరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్‌.. అలవుట్‌ దిశగా..

    న్యూజిలాండ్‌ మరో వికెట్‌ను కోల్పోయింది. ఇప్పటికే వరుస వికెట్లు కోల్పోతూ పీకల్లోతు కష్టాల్లో ఉన్న న్యూజిలాండ్‌ తాజాగా మరో వికెట్‌ను కోల్పోయింది. 284 పరుగుల వద్ద కేల్‌ జమిసెన్‌ అవుట్‌ అయ్యాడు. 23 పరుగుల వద్ద అశ్విన్‌ వేసిన బంతికి షాట్‌కు ప్రయత్నించిని జమిసెన్‌ అక్సర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌ స్కోర్ తొమ్మిది వికెట్లు కోల్పోయి.. 290 పరుగుల వద్ద కొనసాగుతోంది. న్యూజిలాండ్‌ 55 పరుగుల వెనుకంజలో ఉంది.

  • 27 Nov 2021 03:16 PM (IST)

    జోరు మీదున్న అక్సర్‌.. మరో వికెట్‌ పడగొట్టాడు..

    మూడో రోజు న్యూజిలాండ్‌ను టీమిండియా పూర్తిగా కట్టడి చేస్తోంది. టీమిండియా ఇచ్చిన 345 పరుగులను బీట్ చేసేకంటే ముందే అలౌట్‌ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మరో వికెట్‌ పడగొట్టింది. 270 పరుగుల వద్ద టిమ్‌ సౌతీ రూపంలో న్యూజిలాండ్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన సౌతీని, అక్సర్‌ పటేల్‌ బౌల్డ్‌ రూపంలో పెవిలియన్‌ బాట పట్టించాడు.

  • 27 Nov 2021 03:02 PM (IST)

    మరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్..

    టీమిండియా స్కోర్‌ను బీట్ చేసి లీడింగ్‌లో ఉండాలని ఆశపడ్డ న్యూజిలాండ్‌ ఆశలు అంతలా ఫలించేలా కనిపించడం లేదు. రెండో రోజు మంచి ఆటతీరును కనబరిచి న్యూజిలాండ్‌ ప్లేయర్స్‌ మూడో రోజు ఆశించిన స్థాయిలో రాణించలేదని చెప్పాలి. వరుస వికెట్లను కోల్పోయారు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌ ఏడో వికెట్‌ను కోల్పోయింది. టామ్‌ బ్లండెల్‌ రూపంలో న్యూజిలాండ్‌కు మరో దెబ్బ తగిలింది. 258 పరుగుల వద్ద అక్సర్ పటేల్ బౌలింగ్‌లో టామ్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌ ఇంకా 81 పరుగుల వెనుకంజలో ఉంది.

  • 27 Nov 2021 01:48 PM (IST)

    ఆరో వికెట్ డౌన్..

    రచిన్ రవీంద్ర (13) రూపంలో న్యూజిలాండ్ టీం ఆరో వికెట్‌ను కోల్పోయింది. 241 పరుగుల వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. కివీస్ టీం ఇంకా 104 పరుగుల వెనుకంజలో నిలిచింది.

  • 27 Nov 2021 01:24 PM (IST)

    కీలక వికెట్ కోల్పోయిన కివీస్..

    టాం లాథమ్ (95) రూపంలో న్యూజిలాండ్ టీం కీలక వికెట్‌ను కోల్పోయింది. దీంతో 227 పరుగుల వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కీపర్ శ్రీకర్ భరత్ స్టపింగ్‌‌తో సెంచరీ చేయకుండానే టామ్ లాథమ్ పెవిలియన్ చేరాడు.

  • 27 Nov 2021 01:01 PM (IST)

    నాలుగో వికెట్ పడగొట్టిన అక్షర్..

    నికోలస్ (2) రూపంలో న్యూజిలాండ్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 218 పరుగుల వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్‌లో నికోలస్ ఎల్బీగా పెవిలయన్ చేరాడు. కివీస్ టీం ఇంకా 127 పరుగుల వెనుకంజలో నిలిచింది.

  • 27 Nov 2021 12:51 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన కివీస్..

    రాస్ టేలర్ (11) రూపంలో న్యూజిలాండ్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 214 పరుగుల వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కీపర్ శ్రీకర్ భరత్ అద్భుత క్యాచ్‌కు రాస్ టేలర్ పెవిలియన్ చేరాడు. కివీస్ టీం ఇంకా 131 పరుగుల వెనుకంజలో నిలిచింది.

  • 27 Nov 2021 11:39 AM (IST)

    లంచ్ బ్రేక్..

    లంచ్ సమయానికి న్యూజిలాండ్ టీం 2 వికెట్లు కోల్పోయి 197 పరుగులు సాధించింది. ఇంకా 148 పరుగులు వెనుకంజలోనే నిలిచింది. అయితే భారత బౌలర్లు వికెట్ల కోసం తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. అశ్విన్, ఉమేష్ యాదవ్ తలో వికెట్‌ పడగొట్టారు.

  • 27 Nov 2021 11:36 AM (IST)

    కేన్ విలియమ్సన్ ఔట్..

    కేన్ విలియమ్సన్(18) రూపంలో న్యూజిలాండ్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 197 పరుగుల వద్ద భారత్‌కు బిగ్ బ్రేక్ దొరికింది. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీగా విలియమ్సన్ పెవిలియన్ చేరాడు.

  • 27 Nov 2021 10:28 AM (IST)

    భారత్‌పై తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ ఆటగాళ్ల అత్యధిక స్కోర్లు..

    131 కేన్ విలియమ్సన్, అహ్మదాబాద్ 2010/11 105 బ్రూస్ టేలర్, కోల్‌కతా 1964/65 104 జాన్ పార్కర్, ముంబై 1976/77 103 జెస్సీ రైడర్, అహ్మదాబాద్ 2010/11 102 జాన్ గై, హైదరాబాద్ 1955/56 89 విల్ యంగ్, కాన్పూర్ 2021/22

  • 27 Nov 2021 10:24 AM (IST)

    విదేశాల్లో న్యూజిలాండ్ 150+ ఓపెనింగ్ భాగస్వామ్యాలు:

    387 జీ టర్నర్ - టీ జార్విస్ vs వెస్టిండీస్ 1971/72 231 ఎం రిచర్డ్‌సన్ - ఎల్ విన్సెంట్ vs ఇండియా 2003/04 185 జే రైట్ - టీ ఫ్రాంక్లిన్ vs ఇంగ్లండ్ 1990 1990 169 టీ లాథం- ఎం గప్టిల్ vs జింబాబ్వే 2016 163 ఎం రిచర్డ్‌సన్ - ఎస్ ఫ్లెమింగ్ vs ఇంగ్లండ్ 2004 151 టీ లాథమ్ -డబ్యూ యంగ్ vs ఇండియా 2021/22

  • 27 Nov 2021 10:20 AM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్..

    భారత శిబిరంలో అశ్విన్ ఆశలు రేకెత్తించాడు. చిక్కుముడిగా తయారైన న్యూజిలాండ్ ఓపెనింగ్ జోడిని ఎట్టకేలకు విడదీశాడు. 66.1ఓవర్లో అశ్విన్ బౌలింగ్‌లో విల్ యంగ్(89) శ్రీకర్ భరత్ అద్భుత క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. దీంతో 151 పరుగుల వద్ద కివీస్ తొలి వికెట్ కోల్పోయింది.

  • 27 Nov 2021 09:31 AM (IST)

    57 ఓవర్ల వరకు వికెట్ తీయని భారత బౌలర్లు..

    రెండో రోజు ఆట ముగిసే వరకు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 129 పరుగులు చేసింది. లాథమ్ 50, విల్ యంగ్ 74 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 57 ఓవర్లలో భారత జట్టు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది.

  • 27 Nov 2021 09:29 AM (IST)

    భారత్ న్యూజిలాండ్ కాన్పూర్ టెస్ట్ డే 3

    కాన్పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో నేడు మూడో రోజు. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా న్యూజిలాండ్ జట్టు రెండో రోజు ఆట ముగిసే వరకు వికెట్లు కోల్పోకుండా 129 పరుగులు చేసింది.

  • 27 Nov 2021 09:29 AM (IST)

    విల్ యంగ్ ఐస్ ఫస్ట్ సెంచరీ..

    టామ్ లాథమ్‌తో కలిసి విల్ యంగ్ న్యూజిలాండ్ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించాడు. రెండో రోజు 75 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగాడు. తన ఖాతాలో మరిన్ని పరుగులను వేసుకోవడం ద్వారా తన తొలి టెస్టు సెంచరీని పూర్తి చేసుకోవడమే అతని ప్రయత్నం. ఇప్పటి వరకు యంగ్ ఖాతాలో టెస్టు సెంచరీ లేదు.

  • 27 Nov 2021 09:09 AM (IST)

    భారత్‌కు వికెట్లు కావాలి..

    ఈరోజు మూడో రోజు టెస్టు మ్యాచ్‌లో ఇప్పటి వరకు న్యూజిలాండ్ జట్టు పటిష్ట స్థితిలోనే కనిపిస్తోంది. కివీస్ ఓపెనింగ్ జోడీ జట్టు ఖాతాలో 129 పరుగులు చేరింది. మూడో రోజు ఈ జోడీని వీలైనంత త్వరగా బ్రేక్ చేసి, ఆ తర్వాత కివీ జట్టుపై ఆధిపత్యం చెలాయించాలని టీమ్ ఇండియా భావిస్తోంది. భారత్‌కు ప్రస్తుతం వికెట్లు మాత్రమే కావాలి.

Published On - Nov 27,2021 9:08 AM

Follow us