షకీబ్ తర్వాత అతడే..!

బర్మింగ్‌హామ్‌: వరల్డ్‌కప్‌లో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. బంగ్లాదేశ్ తరపున ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్‌లో భాగంగా నిన్న భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ ఐదు వికెట్లు పడగొట్టి.. ఈ ఫీట్ సాధించాడు. మరోవైపు ఆల్‌రౌండర్ షకిబుల్ హాసన్ అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు సాధించిన విషయం తెలిసిందే. ఇక 2011 వరల్డ్‌కప్‌లో షఫిల్‌ ఇస్లామ్‌ బంగ్లా తరపున నాలుగు వికెట్లు తీసిన రికార్డును.. […]

షకీబ్ తర్వాత అతడే..!
Follow us

|

Updated on: Jul 03, 2019 | 1:03 AM

బర్మింగ్‌హామ్‌: వరల్డ్‌కప్‌లో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. బంగ్లాదేశ్ తరపున ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్‌లో భాగంగా నిన్న భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ ఐదు వికెట్లు పడగొట్టి.. ఈ ఫీట్ సాధించాడు.

మరోవైపు ఆల్‌రౌండర్ షకిబుల్ హాసన్ అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు సాధించిన విషయం తెలిసిందే. ఇక 2011 వరల్డ్‌కప్‌లో షఫిల్‌ ఇస్లామ్‌ బంగ్లా తరపున నాలుగు వికెట్లు తీసిన రికార్డును.. ఇప్పుడు షకీబ్, ముస్తాఫిజుర్‌లు బ్రేక్ చేశారు. ఇకపోతే భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Latest Articles