T20 World Cup 2022: టీమిండియాకు గుడ్‌న్యూస్‌.. కరోనా నుంచి కోలుకున్న స్టార్‌ పేసర్‌.. కానీ..

ఈనెల 17న కొవిడ్‌19 బారిన పడ్డ షమీ ముందుగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌... తాజాగా దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లకు దూరమయ్యాడు. అయితే ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌ చెప్పాడు షమీ. కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపాడు.

T20 World Cup 2022: టీమిండియాకు గుడ్‌న్యూస్‌.. కరోనా నుంచి కోలుకున్న స్టార్‌ పేసర్‌.. కానీ..
Mohammed Shami
Follow us
Basha Shek

|

Updated on: Sep 29, 2022 | 9:38 AM

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ బుధవారం (సెప్టెంబర్‌28) నుంచి ప్రారంభమైంది. కాగా ఈ సిరీస్‌కు ఎంపికైనప్పటికీ కరోనా కారణంగా దూరమయ్యాడు మహ్మద్ షమీ. ఈనెల 17న కొవిడ్‌19 బారిన పడ్డ షమీ ముందుగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌… తాజాగా దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లకు దూరమయ్యాడు. అయితే ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌ చెప్పాడు షమీ. కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపాడు. తాజాగా అతనికి నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. ఈవిషయాన్ని అతనే సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ తో పంచుకున్నాడు. కాగా షమీ కరోనా నుంచి కోలుకోవడంతో అతన్నే టీ20 ప్రపంచకప్ జట్టుతో కొనసాగించే అవకాశం ఉంది. అయితే షమీకి కార్డియోవాస్కులర్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ టెస్ట్‌లో పాస్‌ అయితేనే అతను ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్నాడు. కాబట్టి ఈ టెస్ట్‌పైనే షమీ ప్రపంచకప్‌ ఛాన్స్‌ ఆధారపడి ఉంది.

కాగా ఆసియాకప్ 2022‌లో టీమిండియా వైఫల్యంతో షమీని జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్ బాగా వినిపించింది. డెత్‌ ఓవర్లలో పేలవ బౌలింగ్ కారణంగానే టీమిండియా ఫైనల్ చేరలేదని క్రికెట్‌ నిపుణులు, అభిమానులు మండిపడ్డారు. ఈనేపథ్యంలోనే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో సిరీస్‌లకు షమీని ఎంపిక చేశారు భారత సెలెక్టర్లు. అలాగే వరల్డ్‌ కప్‌లో స్టాండ్‌బైగా అవకాశం కల్పించారు. దీంతో షమీ రీఎంట్రీ ఖాయమని అందరూ భావించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ముందే కరోనా బారిన పడ్డాడీ సీనియర్‌ పేసర్‌. అతని స్థానంలో ఉమేశ్ యాదవ్ జట్టులోకి వచ్చినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. మరి షమీ కార్డియోవాస్కులర్ టెస్ట్‌లో నెగ్గుతాడా? ఆస్ట్రేలియా ఫ్లైట్‌ ఎక్కుతాడా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..