హర్భజన్‌ సింగ్‌ శత్రువు రికార్డుల మోత..! వరుసగా 6 సెంచరీలు.. అంతేకాదు 6 బంతుల్లో 6 సిక్సర్లు..

Cricket News: భారత క్రికెట్ జట్టు స్టార్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న సంగతి

హర్భజన్‌ సింగ్‌ శత్రువు రికార్డుల మోత..! వరుసగా 6 సెంచరీలు.. అంతేకాదు 6 బంతుల్లో 6 సిక్సర్లు..
Harbhajan Singh
Follow us
uppula Raju

|

Updated on: Aug 27, 2021 | 9:08 AM

Cricket News: భారత క్రికెట్ జట్టు స్టార్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న సంగతి తెలితసిందే. ఈ పరిస్థితిలో అతడి శత్రువు ఎక్కడ నుంచి వచ్చాడని ఆలోచిస్తున్నారా..! అవును అతడు హర్భజన్ సింగ్‌కి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన వ్యక్తి. ఈ తీర్పు భారత క్రికెట్‌నే కాకుండా ప్రపంచ క్రికెట్‌ని కుదిపేసింది. ఈ సంఘటన ద్వారా భజ్జీకి అతి పెద్ద శత్రువుగా మారిన వ్యక్తి ఈ రోజు చర్చలో ఉన్నాడు. ఎందుకంటే ఆగష్టు 27 న అతను వరుసగా ఆరు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతడెవరో ఒక్కసారి తెలుసుకుందాం.

వాస్తవానికి దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్ ఆల్ రౌండర్ మైక్ ప్రాక్టర్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే 1979 సంవత్సరంలో అతను రెండు వేర్వేరు ఓవర్లలో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టిన ప్రత్యేక ఘనతను సాధించాడు. టౌంటన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ విధ్వంసం సృష్టించాడు. సోమర్‌సెట్ ప్లేయర్‌ డెన్నిస్ బ్రేక్‌వెల్‌ బౌలింగ్‌లో వరుసగా సిక్స్‌లను బాదాడు. ఇక 1970-71 సంవత్సరంలో మైక్ ప్రొక్టర్ వరుసగా ఆరు సెంచరీలను సాధించి ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఒక ప్రత్యేక రికార్డును సృష్టించాడు. CB ఫ్రై, డాన్ బ్రాడ్‌మన్ తర్వాత ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడు ప్రొక్టర్ మాత్రమే.

దక్షిణాఫ్రికా తరఫున 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన మైక్ ప్రొక్టర్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మ్యాచ్ రిఫరీ బాధ్యతను స్వీకరించాడు. అయితే అతని పదవీకాలం వివాదాలతో నిండి ఉంది. 2007-08 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌పై జాతిపరమైన వ్యాఖ్యలు చేసినందుకు భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్‌పై 2007-08లో మూడు మ్యాచ్‌ల నిషేధం విధించారు. అయితే ఈ నిషేధం తరువాత తొలగించారు. ప్రొక్టర్ 7 టెస్టుల్లో 25.11 సగటుతో 226 పరుగులు చేశాడు 41 వికెట్లు సాధించాడు. అదే సమయంలో 401 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 21,936 పరుగులు చేయడంతో పాటు అతను 1417 వికెట్లు కూడా తీసుకున్నాడు.

Pregnancy Time: ప్రెగ్నెన్సీ సమయంలో మీ భార్యను ఇలా సంతోషంగా ఉంచండి.. ఇది తల్లితో పాటు బిడ్డకూ మేలు చేస్తుంది.

Childhood-Rare Photo: అమ్మ ఒడిలో ఉన్న ఈ హైదరాబాదీ చిన్నారి.. జాతీయ ఉత్తమ నటి.. ఎవరో గుర్తుపట్టారా..

Kabul Blast: కాబుల్‌ రక్తసిక్తం.. 73 మందిని పొట్టన పెట్టుకున్న రాక్షసులు.. అమెరికా దళాలే టార్గెట్‌..