Kabul Blast: కాబుల్ రక్తసిక్తం.. 73 మందిని పొట్టన పెట్టుకున్న రాక్షసులు.. అమెరికా దళాలే టార్గెట్..
ఆఫ్ఘనిస్తాన్ రక్తసిక్తమైంది. తాలిబన్లు ఆఫ్ఘన్ నేలను హస్తగతం చేసుకన్న తరువాత దేశంలో హింస రగులుతోంది. ఆఫ్ఘనిస్తాన్.. తాలిబన్ల ఆధీనంలోకి వెల్లిన దగ్గర నుంచి అక్కడ అరాచకాలు మిన్నంటాయి. హింసాకాండ రాజ్యమేలుతోంది.
ఆఫ్ఘనిస్తాన్ రక్తసిక్తమైంది. తాలిబన్లు ఆఫ్ఘన్ నేలను హస్తగతం చేసుకన్న తరువాత దేశంలో హింస రగులుతోంది. ఆఫ్ఘనిస్తాన్.. తాలిబన్ల ఆధీనంలోకి వెల్లిన దగ్గర నుంచి అక్కడ అరాచకాలు మిన్నంటాయి. హింసాకాండ రాజ్యమేలుతోంది. అయితే ఇప్పటి వరకూ జరిగిన ఘటనలు ఒక ఎత్తైతే.. ఇప్పుడు జరిగిన దాడులు అత్యంత విషాదకరం. ముఖ్యంగా అమెరికా దళాలే టార్గెట్‌గా కాబూల్‌లో దాడులు జరిగనట్టు తెలుస్తోంది. రాక్షసులు రాజ్యమేలితే.. దుష్ట శక్తులకు అధికారం వస్తే ఏం జరుగుతుందో.. కరెక్ట్‌గా అదే అక్కడ జరుగుతోంది. ఆప్ఘన్‌లో హింసాకాండ ఊహించిందే.. కానీ ఇంతటి దారుణమైన ఘటనలకు పాల్పడతారనీ.. అమాయక జనాల్ని తునాతునకలు చేస్తారని మాత్రం ఊహించలేదు. అంతర్జాతీయ సమాజం ఊహకందని రక్తపాతం జరిగింది.
కాబూల్ విమానాశ్రయం చుట్టూరా ఉన్న పరిసరాల్లో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 6 బాంబులు పేలాయి. ఈ ఘటనలో 73 మంది ప్రాణాలు కోల్పోయారు. 160 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. చనిపోయిన వారిలో 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఎంతో మంది అమాయక ప్రజలు దేశం దాటేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఇంతలో పెద్ద శబ్దం వచ్చింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వందల మంది గాల్లోకి ఎగిరిపడ్డారు. ఒకేసారి రెండు పేలుళ్లు జరిగాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఒంటినిండా బాంబులు ధరించి జనాల్లోకి ప్రవేశించిన.. రెండు మానవ మృగాలు ఊహించని ఘోరాన్ని సృష్టించాయి. వందల మంది జనాల్లోకి వెళ్లి ఆత్మాహుతి దాడి చేశారు.
కాబూల్ ఎయిర్‌పోర్టు గేటు నుంచి కొంచెం ముందుకు వెళ్తే బరూన్ హోటల్ సమీపంలో మరో బాంబు పేల్చారు. ఆప్ఘన్‌కు వెళ్లే.. ప్రముఖుల్లో చాలా మంది ఈ హోటల్‌లోనే బస చేస్తారు. ఇప్పుడు ఈ హోటల్‌కు సమీపంలోనే ఈ బ్లాస్ట్ జరిగింది. ఇక్కడా పదుల సంఖ్యలో అమాయకులు బలయ్యారు.
ఇక మూడో స్పాట్ ఎక్కడంటే..
కాబూల్ ఎయిర్‌పోర్టుకు బ్యాక్ సైడ్. ఎయిర్‌పోర్టులోకి జనాలు వెళ్లేందుకు ప్రయత్నించేది ఇక్కడి నుంచే. వాళ్లంతా ఉండేది ఈ గేటు దగ్గరే.. అక్కడే మూడో బ్లాస్ట్.. అంటే 4, 5 బ్లాస్టులు జరిగాయి. ఇక ఎయిర్‌పోర్టుకు కూత వేటు దూరంలో ఉన్న ఎమర్జెన్సీ హాస్పిటల్ సమీపంలో మరో బాంబు పేలింది.
ముష్కర సేనలను అడ్డుకునేందుకు అమెరికా సేనలు ఎదురు దాడికి దిగాయి. ఉగ్రవాదులు, సైనికుల కాల్పుల మోతలతో.. ఎయిర్ పోర్టు మొత్తం అట్టుడికిపోయింది. ఆ శబ్దాలు వింటేనే గుండెల్లో వణుకు పుడుతోంది. ఇక అక్కడ ఉన్న వాళ్ల పరిస్థితి. జనాలు ఎలా పరిగెడుతున్నారో.. వీళ్లందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాబూల్ వీధుల్లో పరుగులు పెడుతున్నారు. ఏ గుండు వాళ్ల గుండెల్లో దిగుతుందో.. తెలీదు. ఎప్పుడు బ్లాస్ట్ జరుగుతుందోననే భయం.. వాళ్లను ఇలా పరుగెట్టేలా చేసింది.
వెంటాడి వేటాడుతాం…
దాడులకు పాల్పడింది తామేనని.. ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించారు. 160 మందిని చంపినట్టు ప్రకటించుకుంది ముష్కర మూక. ఆప్ఘన్ ఘటనలపై అమెరికా తీవ్రంగా స్పందించింది. ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులను చంపేయాల్సిందిగా.. బైడన్ ఆదేశించారు. తమ సైనికులను చంపిన వారిని.. ప్రాణాలతో వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా.. వెంటాడి వేటాడుతామన్నారు బైడెన్.
ఆ సైనికులు నిజమైన హీరోలు..
అంతేకాకుండా చనిపోయిన సైనికులను హీరోలుగా ప్రకటించారు. వీరజవాన్లకు నివాళి అర్పిస్తూ వైట్ హౌస్ మీద ఉన్న అమెరికా జాతీయ జెండాను కిందకు దించారు. ఈ నెల 31 వరకూ జెండా ఇలాగే ఉంటుందని అమెరికా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి కూడా ఈ ఘటనను ఖండించింది. ఆప్ఘనిస్థాన్ అనిశ్చితి పాలనకు.. ఈ ఘటనే నిదర్శనమని ప్రకటించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలకు వ్యతిరేకంగా ప్రపంచం ఏకం కావాల్సిన అవసరం ఉందని భారత్ ప్రకటించింది.
అయితే దాడులను ఖండిస్తున్నట్టు దుష్ట తాలబన్లు ప్రకటించారు. కాబూల్‌లో భద్రత మరింత పెంచుతామన్నారు. కానీ వాళ్ల ప్రకటన తర్వాతే మూడు బ్లాస్టులు జరిగాయి. మరోవైపు కాబూల్ హింసా కాండతో.. అక్కడి ప్రజల్లో పూర్తిగా భయం ఆవహించింది. ఎలాగైనా ప్రాణాలు దక్కించుకోవాలన్న ఆరాటంతో సరిహద్దులకు పరుగులు తీస్తున్నారు. పాకిస్థాన్ బోర్డర్‌కు వేలాది మంది చేరుకున్నారు. కానీ వారిని పాకిస్థాన్ అనుమతించడం లేదు.
ఇవి కూడా చదవండి: E-Shram Card: అసంఘటిత రంగం కార్మికులకు ఓ వ్యవస్థ ఈ-శ్రామ్ కార్డ్.. ఇది ఎలా ఫిల్ చేయాలి.. స్టెప్ బై స్టెప్ ఇక్కడ తెలుసుకోండి