Afghan Crisis: కాబూల్ విమానాశ్రయం వద్ద భారీ పేలుళ్లు.. 72 మంది దుర్మరణం..

తాలిబన్ల వశం అయిన అప్గానిస్తాన్‌ రావణకాష్టంలా రగులుతోంది. అనుకున్నంతా అయ్యింది. అమెరికా సహా పలు దేశాలు భయపడుతున్నట్టే కాబుల్‌..

Afghan Crisis: కాబూల్ విమానాశ్రయం వద్ద భారీ పేలుళ్లు.. 72 మంది దుర్మరణం..
Kabul 1
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 27, 2021 | 8:29 AM

తాలిబన్ల నియంత్రణలో వెళ్లిన అప్గానిస్తాన్‌ దేశం రావణకాష్టంలా రగులుతోంది. ఆఫ్గాన్ రాజధాని కాబూల్ ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. గురువారం సాయంత్రం విమానాశ్రయం వెలుపల వరుసగా జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలలో సుమారు 72 మంది మరణించారు. చనిపోయిన వారిలో 12 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. అలాగే మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్లు అమెరికా వెల్లడించింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పెంటగాన్ స్పష్టం చేసింది. మొత్తంగా ఈ పేలుళ్లలో 143 మందికి తీవ్ర గాయాలైనట్లు ఆఫ్గాన్, అమెరికా అధికారులు స్పష్టం చేశారు. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చునని భావిస్తున్నారు.

Kabul 3

కాబూల్ విమానాశ్రయం వెలుపల అబ్బే గేట్ వద్ద ఒక పేలుడు సంభవించగా.. కాసేపటికే అక్కడే సమీపంలో ఉన్న బేరన్ హోటల్ వద్ద మరో పేలుడు సంభవించింది. ఈ రెండూ కూడా ఆత్మాహుతి దాడులని అమెరికా రక్షణశాఖ కార్యాలయ ప్రతినిధి జాన్ కిర్బి వెల్లడించారు. కాగా, కాబుల్‌ ఎయిర్‌పోర్టు వద్ద ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని అమెరికా సహా నాటో దేశాలు హెచ్చరించిన గంటల వ్యవధిలోనే పేలుడు సంభవించడం కలకలం సృష్టిస్తోంది.

Kabul 2

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్