AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ‘రోహిత్ నిస్వార్థపరుడు.. రికార్డుల కోసం కాదు.. జట్టు కోసమే ఆడతాడు..’: మాజీ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు

MI vs CSK: మ్యాచ్ చివరి ఓవర్లో రోహిత్ 61 బంతుల్లో సెంచరీ పూర్తి చేసినా ఆ తర్వాత మ్యాచ్ పూర్తిగా చేజారింది. సెంచరీ చేసిన తర్వాత కూడా ఈ ముంబై ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ సంబరాలు చేసుకోలేదు లేదా బ్యాట్‌ను పైకి ఎత్తలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ విషయంలో రోహిత్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Video: 'రోహిత్ నిస్వార్థపరుడు.. రికార్డుల కోసం కాదు.. జట్టు కోసమే ఆడతాడు..': మాజీ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు
Rohit Sharma Video
Venkata Chari
|

Updated on: Apr 15, 2024 | 1:48 PM

Share

Rohit Sharma Century: ఆదివారం వాంఖడే మైదానంలో జరిగిన హైవోల్టేజీ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌లో తన మొదటి సెంచరీని సాధించాడు. అయితే 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో తన జట్టును విజయపథంలో నడిపించడంలో విజయం సాధించలేకపోయాడు. మ్యాచ్ చివరి ఓవర్లో రోహిత్ 61 బంతుల్లో సెంచరీ పూర్తి చేసినా ఆ తర్వాత మ్యాచ్ పూర్తిగా చేజారింది. సెంచరీ చేసిన తర్వాత కూడా ఈ ముంబై ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ సంబరాలు చేసుకోలేదు లేదా బ్యాట్‌ను పైకి ఎత్తలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ విషయంలో రోహిత్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

రోహిత్‌పై బ్రెట్ లీ ప్రశంసలు..

ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ ఇప్పుడు రోహిత్‌ని నిస్వార్థంగా పిలిచాడు. ప్రశంసించాడు. మ్యాచ్ అనంతరం జియో సినిమాతో మాట్లాడిన లీ.. రోహిత్ ఇన్నింగ్స్‌ను కొనియాడాడు. రోహిత్ సెంచరీ చేసినా.. సెలబ్రేషన్స్ చేసుకోకపోవడం జట్టు విజయమే అతనికి ఎంత ముఖ్యమో తెలియజేస్తోందని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

రోహిత్ జట్టు కోసం ఆడుతున్నాడు: లీ

బ్రెట్ లీ మాట్లాడుతూ, ” రోహిత్ శర్మ అద్భుత సెంచరీ చేశాడు. అతను క్రీజులోకి వచ్చి దాడి చేయడం ప్రారంభించాడు. అతను సెంచరీ సాధించినప్పుడు నాకు నచ్చింది. కానీ అతని బ్యాట్ ఎత్తలేదు. నాకు ఇది సెంచరీని చూపిస్తుంది. తన వ్యక్తిగత మైలురాయి కంటే, రోహిత్ మొదటి బంతి నుంచి తన ఉద్దేశాలను స్పష్టంగా తెలిపాడు. 5 సిక్సర్ల సహాయంతో అజేయంగా 105 పరుగులు చేసినా, తనలో జట్టు విజయం సాధించలేదనే కసి కనిపించింది’ అంటూ చెప్పుకొచ్చాడు.

రోహిత్ శర్మ తప్ప మరే ఇతర ముంబై బ్యాట్స్‌మెన్ కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌లు రోహిత్‌కు సాయం చేయడంలో విఫలమవడంతో చివర్లో క్రీజులో హిట్‌మ్యాన్ ఒక్కడే మిగిలాడు. చెన్నై బౌలర్లు రోహిత్‌ను ట్రాప్ చేయడానికి స్లో బంతులను అద్భుతంగా ఉపయోగించారు. అతన్ని వేగంగా పరుగులు చేయడానికి అనుమతించలేదు. చెన్నై బౌలర్లు చివరి 7 ఓవర్లలో ఆట మొత్తాన్ని మార్చేశారు. ఈ ఓటమితో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..