Ranji Trophy: క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్.. ప్రాక్టీస్‌కు లేటైతే వేటే.. ఈ కోచ్ రూల్స్ చూస్తే ఒంట్లో వణుకుపుట్టాల్సిందే..
మధ్యప్రదేశ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ కఠోర శ్రమ, క్రమశిక్షణ కూడా ఈ విజయం వెనుక ఉన్నాయి. మధ్యప్రదేశ్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్న తర్వాత, ఆటగాళ్లను వారి కుటుంబాలకు దూరంగా ఉంచడంతోపాటు, మీడియాతో ఎవరూ మాట్లాడకూడదంటూ ఎన్నో కండీషన్లు పెట్టాడంట.
మధ్యప్రదేశ్ తొలిసారి రంజీ ఛాంపియన్‌గా నిలిచింది. అది కూడా 41 ఏళ్ల పాటు రంజీలో తిరుగులేకుండా రాణిస్తోన్న ముంబైని ఓడించి, సరికొత్త చరిత్ర నెలకొల్పింది. కేవలం రెండేళ్ల వ్యవధిలో మధ్యప్రదేశ్‌ను ఛాంపియన్‌గా నిలిపిన చంద్రకాంత్ పండిట్‌ను కోచ్‌లందరూ కొనియాడుతున్నారు. మధ్యప్రదేశ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ కఠోర శ్రమ, క్రమశిక్షణ కూడా ఈ విజయం వెనుక ఉన్నాయి. మధ్యప్రదేశ్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్న తర్వాత, ఆటగాళ్లను వారి కుటుంబాలకు దూరంగా ఉంచడంతోపాటు, మీడియాతో ఎవరూ మాట్లాడకూడదంటూ ఎన్నో కండీషన్లు పెట్టాడంట. అయితే, ఇవన్నీ ట్రోఫిని దక్కించుకోవడానికే అని ఇప్పుడు అంతా కోడై కూస్తున్నారు. ఇంతకీ ఎవరా చంద్రకాంత్ పండిట్, దేశంలోని అతిపెద్ద దేశీయ టోర్నమెంట్‌లో ఫైనలిస్ట్‌గా చేయడానికి పండిట్ సాధారణ జట్టును ఎలా మార్చాడో చూద్దాం..
క్రమశిక్షణకు మారుపేరు..
క్రమశిక్షణపై కోచ్ చంద్రకాంత్ ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఆటగాళ్ళ కదలికల టైమింగ్ అయినా, డ్రెస్ కోడ్ అయినా, టీమ్ బిహేవియర్ అయినా.. చిన్నపాటి క్రమశిక్షణా రాహిత్యాన్ని కూడా పండిట్ సహించలేదు. పండిట్ నుంచి పిలుపు మేరకు, జట్టు ప్రాక్టీస్ కోసం మైదానంలోనే ఎక్కువ సమయం ఉండేది. ఒక్కోసారి రాత్రి 12 గంటలకు కూడా ఆటగాళ్లను మైదానంలోనే ఉంచేవాడు. ఆ సమయంలో క్రీడాకారుల అప్రమత్తతను చూడాలన్నారు. ఒక ఆటగాడు శిక్షణలో ఆలస్యం అయితే, అతను మొత్తం సెషన్ నుంచి దూరం కావాల్సిందేనట. బయలు దేరిన సమయంలో ఎవరైనా ఆలస్యమైతే అతడిని అక్కడే వదిలేసి టీమ్ వెళ్లిపోయేవారు. తరువాత ఆటగాడు తన సొంత ఖర్చులతో జట్టులో చేరేవారంట.
జూనియర్-సీనియర్ సంస్కృతికి వ్యతిరేకం..
జూనియర్ అయినా సీనియర్ అయినా.. అందరూ ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకునేవారు. అలాగే అందర్నీ భయ్యా అని పిలవమని సలహా ఇచ్చే వాడంట. ఆటగాళ్లను మానసికంగా కఠినంగా మార్చేందుకు, మోవ్‌లోని ఆర్మీ ఇన్‌ఫాంట్రీ స్కూల్‌లో ఆటగాళ్ల సెషన్‌లను నిర్వహించేవారంట. ఇందుకోసం సైన్యం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. అంతే కాదు అక్కడి నిపుణులను పిలిపించి క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు స్టేడియంకు కూడా పిలిపించారు.
యువత కోసం సెలెక్టర్లతో పోరాటం..
పండిట్ బలమైన జట్టును నిర్మించడానికి డివిజనల్ మ్యాచ్‌లు, ట్రయల్స్ ద్వారా ఆటగాళ్లను స్కౌట్ చేసేవాడు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను శిబిరానికి పిలిచారు. ఈ సీజన్‌లో ఆటగాడి ఎంపికపై సెలెక్టర్లతో వాగ్వాదానికి దిగినట్లు కూడా పలుమార్లు వార్తల్లోకి ఎక్కాడు. ఆయన రాజీనామా చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ప్రతి ఆటగాడికి ఓ టైంటేబుల్ సిద్ధంగా ఉంచేవాడంట. ఇందులో అతని ప్రదర్శన, శిక్షణ షెడ్యూల్ అన్నీ ఉంటాయి. ప్రతిరోజు టీమ్ మీటింగ్స్ జరిగేవి. ఇందులో కోచ్ ప్రతి ఆటగాడికి తన ఆటకు సంబంధించిన చిట్కాలు ఇస్తూ మరుసటి రోజుకి సిద్ధం చేసేవాడు.
పండిట్ రెండు సంవత్సరాల వ్యవధిలో జట్టు కోసం 405 రోజుల శిక్షణా శిబిరాన్ని నిర్వహించాడు. వర్షంలోనే శిబిరాన్ని నిర్వహించాడు. పండిట్ అన్ని రకాల సవాళ్ల కోసం రంజీ జట్టుతో పాటు మహిళల జట్టు, ఎడ్జ్ గ్రూప్ జట్లకు చెందిన ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చాడు. పండిట్ కోచ్ అయిన తర్వాత, అండర్-19 క్రికెటర్ రంజీ జట్టు ఆటగాళ్లతో కూడా నెట్స్ చేయగలడు. పండిట్‌కు స్వయంగా క్రికెట్ మ్యాచ్‌లు చూడటం ఇష్టం. అతను ఏజ్ గ్రూప్ క్రికెట్‌లోని డివిజనల్ మ్యాచ్‌లు చూడటానికి వెళ్లేవాడు. ప్రతిభ ఉన్న ఆటగాడు ఎవరైనా కనిపిస్తే శిబిరానికి పిలిచేవాడు.
ఈ సీజన్ మ్యాచ్ సిమ్యులేషన్ ప్రాక్టీస్ కూడా ఉపయోగపడిందని శిబిరానికి సంబంధించిన ఒకరు తెలిపారు. శిబిరంలో ఆటగాళ్లకు పరిస్థితులను అందించి, అందుకు అనుగుణంగా ఆడాలని కోరాడు. ఈ సమయంలో, ప్రతి ఆటగాడి చెవిలో వినికిడి పరికరం ఉంటుంది. కోచ్ బౌండరీ వెలుపల వాకీ టాకీ నుంచి సూచనలు ఇచ్చేవాడు.
రెండేళ్ల క్రితం జట్టుతో అనుబంధం..
రెండేళ్ల క్రితమే జట్టు కోచింగ్ బాధ్యతలు స్వీకరించాడు. పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదిలోనే ఎంపీ జట్టు లీగ్ రౌండ్ లోనే పరాజయం పాలైంది. తర్వాత సీజన్‌లో అంటే ఈసారి ఎంపీ అద్భుతం చేసింది. దాదాపు రూ.1.5 కోట్ల వార్షిక వేతనంతో నియమితులైన కోచ్ పండిట్ రెండేళ్లలో టీమ్‌ను ఫ్లోర్‌కు తీసుకెళ్లాడు. అంతకుముందు, అతను 2015-16లో ముంబైని, 2017-18, 2018-19లో విదర్భను ఛాంపియన్‌గా చేశాడు.
ఆటగాడిగా పండిట్ టీమ్ ఇండియా తరపున ఐదు టెస్టులు, 36 వన్డేలు ఆడాడు. అతను 1986 ప్రపంచ కప్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అతను తన కెరీర్‌లో 171 టెస్టులు, 290 వన్డేలు ఆడాడు. అతని దేశీయ కెరీర్ గురించి మాట్లాడితే, ముంబై తరపున ఆడిన 138 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో, పండిట్ తన పేరు మీద 48.57 సగటుతో 8,209 పరుగులు చేశాడు. అతను 22 సెంచరీలు, 42 అర్ధ సెంచరీలు చేశాడు. అతని అత్యధిక స్కోరు 202 పరుగులుగా నిలిచింది.