Ranji Trophy: అత్యధిక పరుగుల నుంచి వికెట్ల వరకు.. ‘రంజీ’లో సూపర్ స్టార్స్ వీరే.. లిస్టులో హైదరాబాద్ ప్లేయర్..

మధ్యప్రదేశ్‌కు ముంబై 108 పరుగుల లక్ష్యాన్ని అందించగా, మధ్యప్రదేశ్ 4 వికెట్ల నష్టానికి సులువుగా సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 116, రెండో ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసిన ఛాంపియన్ జట్టు బ్యాట్స్‌మెన్ శుభమ్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

Venkata Chari

|

Updated on: Jun 26, 2022 | 7:46 PM

ముంబైపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన మధ్యప్రదేశ్ తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు ముంబై 108 పరుగుల లక్ష్యాన్ని అందించగా, మధ్యప్రదేశ్ 4 వికెట్ల నష్టానికి సులువుగా సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 116, రెండో ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసిన ఛాంపియన్ జట్టు బ్యాట్స్‌మెన్ శుభమ్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

1 / 5
అదే సమయంలో, రంజీ ట్రోఫీ మొత్తం సీజన్‌లో తన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టించిన ముంబైకి చెందిన సర్ఫరాజ్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో సర్ఫరాజ్ అత్యధికంగా 982 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.

2 / 5
ముంబైకి చెందిన షామ్స్ ములానీ ఈ సీజన్‌లో 45 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతను ఒక మ్యాచ్‌లో 6 సార్లు 5 వికెట్లు, రెండుసార్లు 10 వికెట్లు తీసుకున్నాడు. 167 పరుగులకు 11 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమం. షామ్స్ 54 మెయిడిన్ ఓవర్లు వేశాడు.

3 / 5
ఈ రంజీ ట్రోఫీ సీజన్‌లో మధ్యప్రదేశ్ స్టార్ బ్యాట్స్‌మెన్ రజత్ పాటిదార్ అత్యధిక క్యాచ్‌లు అందుకున్నాడు. 6 మ్యాచ్‌ల్లో మొత్తం 19 క్యాచ్‌లు పట్టి అద్భుతాలు చేశాడు.

4 / 5
హైదరాబాద్‌కు చెందిన ప్రతీక్ రెడ్డి అత్యుత్తమ వికెట్ కీపర్ అని నిరూపించుకున్నాడు. 3 మ్యాచ్‌ల్లో 6 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 21 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపడంలో అతను బౌలర్లకు సహాయం చేశాడు. ఈ సమయంలో అతను వికెట్ వెనుక 18 క్యాచ్‌లు తీసుకున్నాడు. 3 సార్లు స్టంప్ చేశాడు.

5 / 5
Follow us