ఆదివారం నుంచి భారత్, ఐర్లాండ్ మధ్య 2 టీ20ల సిరీస్ జరగనుంది. వీరిద్దరి మధ్య ఇప్పటి వరకు కేవలం 3 టీ20 మ్యాచ్‌లు మాత్రమే జరగ్గా మూడింటిలోనూ భారత్ విజయం సాధించింది. 2009లో జరిగిన ICC T20 ప్రపంచకప్‌లో తొలిసారిగా ఇరు జట్లు ముఖాముఖి తలపడ్డాయి. ఆ తర్వాత 2018లో రెండు జట్ల మధ్య మరో 2 T20 మ్యాచ్‌లు జరిగాయి. గతంలో కూడా ఐర్లాండ్‌తో టీ20 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ పాండ్యా నేతృత్వంలో భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ సిరీస్‌లో, కెప్టెన్ పాండ్యాతో సహా 6గురు భారత ఆటగాళ్లు టీ20 క్రికెట్‌లో ప్రత్యేక రికార్డు సృష్టించాలని చూస్తున్నారు.