Watch Video: ‘కోహ్లీ వికెట్.. భావితరాలకు ఓ పాఠంలా చెప్పాల్సిందే’.. కీలక వ్యాఖ్యలు చేసిన ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన బౌలర్..
Virat Kohli Wicket: భారత్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రోమన్ వాకర్ 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. రోహిత్ శర్మ, హనుమ విహారి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, విరాట్ కోహ్లీలను పెవిలియన్ చేర్చాడు.
ఈ వారానికి ముందు, భారతీయ అభిమానులు రోమన్ వాకర్(Roman Walker) అనే ప్లేయర్ పేరు అస్సలు విని ఉండరు. కానీ, ఈ 21 ఏళ్ల బౌలర్ భారతదేశానికి వ్యతిరేకంగా లీసెస్టర్‌షైర్ తరపున ఆడుతూ అద్భుతమైన ప్రదర్శన చేసి ఓవర్‌నైట్ స్టార్‌గా మారాడు. వేల్స్‌కు చెందిన వాకర్, ఇంకా ఫస్ట్-క్లాస్ మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే అతను వార్మప్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టడానికి ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టలేదు. అది రోహిత్ శర్మ అయినా, విరాట్ కోహ్లీ అయినా సరే.. ఈ బౌలర్ వలలో చిక్కుకుని తప్పించుకోలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో రోమన్ వాకర్ 11 ఓవర్లలో 24 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ, హనుమ విహారి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, విరాట్ కోహ్లీల వికెట్లను పడగొట్టి సత్తా చాటాడు.
కోహ్లీ ఔటైన తర్వాత నుంచి ఒకటే మెసేజ్‌లు..
భారత మాజీ కెప్టెన్ కోహ్లీని అవుట్ చేయడం ద్వారా వాకర్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. కోహ్లీని పెవిలియన్‌కు పంపినప్పటి నుంచి అతడి ఫోన్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి. ఫాక్స్ టీవీతో ఆయన మాట్లాడుతూ.. భారత్ లాంటి బలమైన జట్టుపై ప్రతి ఒక్కరూ సత్తా చూపాలని కోరకుంటారు. 5 వికెట్లు తీయడం అద్భుతంగా ఉంది. నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నాను. నా స్నేహితులు కొందరు మెసేజ్ చేస్తూ.. విరాట్ కోహ్లి వికెట్ మనవాళ్లకు ఓ పాఠంలా చెప్పాలని అంటున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు.
☝️ | Kohli (33) lbw Walker.@RomanWalker17 strikes again! This time he hits the pads of Kohli, and after a long wait the umpire’s finger goes up.
Out or not out? ?
?? IND 138/6
???? ??????: https://t.co/adbXpwig48 ?
? #IndiaTourMatch | #LEIvIND pic.twitter.com/iE9DNCUwLO
— Leicestershire Foxes ? (@leicsccc) June 23, 2022
పంత్‌తో కలిసి బ్యాటింగ్‌ను ఆస్వాదించిన వాకర్..
రిషబ్ పంత్‌తో కలిసి వాకర్ తొలి ఇన్నింగ్స్‌లో 70 పరుగులు జోడించాడు. వాస్తవానికి, ఈ వార్మప్ మ్యాచ్‌లో పంత్, ఛెతేశ్వర్ పుజారాతో సహా చాలా మంది ఆటగాళ్లు కూడా లీసెస్టర్‌షైర్ తరపున ఆడుతున్నారు. పంత్, వాకర్ ఇద్దరూ కలిసి తొలి ఇన్నింగ్స్‌లో 70 పరుగులు జోడించారు. పంత్ గురించి వాకర్ మాట్లాడుతూ, అతనితో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా సరదాగా ఉందని చెప్పుకొచ్చాడు.