AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG vs DC Toss, Playing 11: టాస్ గెలిచిన లక్నో.. ఐపీఎల్ రికార్డ్ బౌలర్ మిస్.. ఢిల్లీ ఓడితే, ప్లే ఆఫ్స్ కష్టమే..

Lucknow Super Giants vs Delhi Capitals, 26th Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 26వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నేడు ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తలపడనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి (ఇకానా) స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో లక్నో టీం టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ టీం ముందుగా బౌలింగ్ చేయనుంది.

LSG vs DC Toss, Playing 11: టాస్ గెలిచిన లక్నో.. ఐపీఎల్ రికార్డ్ బౌలర్ మిస్.. ఢిల్లీ ఓడితే, ప్లే ఆఫ్స్ కష్టమే..
Lsg Vs Dc Toss Update
Venkata Chari
|

Updated on: Apr 12, 2024 | 7:22 PM

Share

Lucknow Super Giants vs Delhi Capitals, 26th Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 26వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నేడు ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తలపడనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి (ఇకానా) స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో లక్నో టీం టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ టీం ముందుగా బౌలింగ్ చేయనుంది.

లక్నో 17వ సీజన్‌లో ఇది ఐదో మ్యాచ్‌. LSG 4 మ్యాచ్‌లలో 3 విజయాలు, 1 ఓటమితో 6 పాయింట్లను కలిగి ఉంది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు మూడో స్థానంలో ఉంది. మరోవైపు ఢిల్లీకి ఇది ఆరో మ్యాచ్‌. ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచ్‌ల్లో కేవలం 1 విజయం, 4 ఓటములతో 2 పాయింట్లను కలిగి ఉంది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు అట్టడుగున 10వ స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి

ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే..

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కీపర్/కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్, KL రాహుల్(కీపర్/కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్.

రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు..

ఢిల్లీ క్యాపిటల్స్: ఝే రిచర్డ్‌సన్, అభిషేక్ పోరెల్, కుమార్ కుషాగ్రా, సుమిత్ కుమార్, ప్రవీణ్ దూబే.

లక్నో సూపర్ జెయింట్స్: కృష్ణప్ప గౌతం, దీపక్ హుడా, మణిమారన్ సిద్ధార్థ్, అమిత్ మిశ్రా, మాట్ హెన్రీ.

లక్నో గత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా విజయాలే..

ఈ సీజన్‌లో లక్నోకు శుభారంభం లభించలేదు. ఆ జట్టు తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ వరుసగా విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్‌పై 21 పరుగుల తేడాతో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 28 పరుగులతో, గుజరాత్ టైటాన్స్‌పై 33 పరుగుల తేడాతో ఓడింది.

ఈ సీజన్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ జట్టు తరపున అత్యధిక పరుగులు చేశాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 178 పరుగులు చేశాడు. ఆ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ మయాంక్‌ యాదవ్‌ టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఈరోజు ఆడడం అతనికి కష్టంగా మారింది. జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో యశ్ ఠాకూర్ రెండో స్థానంలో ఉన్నాడు. అతని పేరిట 6 వికెట్లు కూడా ఉన్నాయి.

ఢిల్లీ బ్యాడ్ ఫామ్ కొనసాగుతోంది. జట్టు టాప్ వికెట్ టేకర్ ఖలీల్ అహ్మద్, ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాడ్ ఫామ్ కొనసాగుతోంది. ఐదు మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఒక్క మ్యాచ్‌ మాత్రమే గెలవగలిగింది. పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, ముంబయి ఇండియన్స్‌పై ఆ జట్టు పరాజయాలను చవిచూడాల్సి వచ్చింది. ఢిల్లీ ఏకైక విజయం చెన్నై సూపర్ కింగ్స్‌పై మాత్రమే వచ్చింది.

పిచ్ నివేదిక: ఐపీఎల్‌లో లక్నో పిచ్‌పై స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. ఇక్కడ తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లు కనిపించాయి. బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడం చాలా కష్టమైంది. ఇప్పటి వరకు ఇక్కడ మొత్తం 9 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇక్కడ అత్యధిక జట్టు స్కోరు 199/8, ఇది ఈ సంవత్సరం పంజాబ్ కింగ్స్‌పై LSG చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు