AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: 15 బంతులు.. 5 రన్స్‌.. 5 వికెట్లు.. లక్నోను పేకమేడలా కూల్చిన ఉత్తరాఖండ్‌ ఇంజనీర్‌.. రికార్డుల బద్దలు

ఉత్తరాఖండ్‌కు చెందిన ఆకాశ్‌ మధ్వల్‌ (3.3-0-5-5) మెరపు బౌలింగ్‌కు లక్నో బ్యాటర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. మధ్వల్ మెరుపు బంతులకు వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లూ పెవిలియన్‌ చేరుకున్నారు. స్టొయినిస్‌ (27 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40) మినహా మరే ఆటగాడు కనీసం 20 పరుగులైనా చేయలేకపోయాడు.

IPL 2023: 15 బంతులు.. 5 రన్స్‌.. 5 వికెట్లు.. లక్నోను పేకమేడలా కూల్చిన ఉత్తరాఖండ్‌ ఇంజనీర్‌.. రికార్డుల బద్దలు
Mumbai Indians
Basha Shek
|

Updated on: May 25, 2023 | 9:01 AM

Share

ఐపీఎల్‌లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ మరోసారి టైటిల్‌ వేటలో దూసుకెళుతోంది. టోర్నీ ఆరంభంలో తడబడిన రోహిత్ సేన ఆ తర్వాత నిలబడింది. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇక బుధవారం లక్నోతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో మరో అద్భుత విజయం సాధించి రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. ముంబై విధించిన 182 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకు కుప్పకూలింది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఆకాశ్‌ మధ్వల్‌ (3.3-0-5-5) మెరపు బౌలింగ్‌కు లక్నో బ్యాటర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. మధ్వల్ మెరుపు బంతులకు వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లూ పెవిలియన్‌ చేరుకున్నారు. స్టొయినిస్‌ (27 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40) మినహా మరే ఆటగాడు కనీసం 20 పరుగులైనా చేయలేకపోయాడు. దీంతో ముంబై ఏకంగా 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సంచలన స్పెల్‌తో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన ఆకాశ్‌ మధ్వల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

తొలి బౌలర్‌గా…

కాగా ఐపీఎల్‌ ప్రారంభానికి ముందే స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సేవలను కోల్పోయింది. అయితే జోఫ్రా ఆర్చర్ ఆ లోటును భర్తీ చేస్తాడని అనుకున్నారు కానీ అది కుదరలేదు. అలాంటి పరిస్థితుల్లో 24-25 ఏళ్ల వరకు టెన్నిస్‌ బాల్‌తో క్రికెట్‌ ఆడిన ఆకాష్‌ మధ్వల్‌ రూపంలో ముంబైకు ఓ వరంలా దొరికాడు. ఇది ఆకాష్‌కి తొలి ఐపీఎల్ సీజన్‌. అలాగే అతను ప్లేఆఫ్‌లలో కూడా ఆడడం ఇదే తొలిసారి. 4 సంవత్సరాల పాటు సాధారణ క్రికెట్ బాల్ (లెదర్ బాల్)తో క్రికెట్ ఆడటం ప్రారంభించిన ఆకాష్, చెన్నైలో మాత్రం చరిత్ర సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాష్ 3.3 ఓవర్లలో 5 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించాడు. దీంతో పలు రికార్డులు బద్దలయ్యాయి. ప్లేఆఫ్/నాకౌట్ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఆకాష్ నిలిచాడు. లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజ బౌలర్లు సైతం ఈ ఫీట్‌ను అందుకోలేకపోయారు. ఇక ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన చేసిన బౌలర్‌గా మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఆకాశ్‌ కంటే ముందు లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కూడా 5 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో నాలుగో బెస్ట్‌ బౌలర్‌గా ఆకాశ్‌ నిలిచాడు. అల్జారి జోసెఫ్‌ (6/12) అగ్రస్థానంలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..