LSG vs GT: హాఫ్ సెంచరీతో హార్దిక్ కెప్టెన్ ఇన్నింగ్స్.. లక్నో ముందు టార్గెట్ ఎంతంటే?
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టీం నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. దీంతో లక్నో ముందు 136 పరుగుల టార్గెట్ నిలిచింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 66 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-16వ సీజన్ 30వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జెయింట్స్ ముందు 136 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. లక్నోలోని భారతరత్న అటల్ విహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 50 బంతుల్లో 66 పరుగులతో అర్ధ సెంచరీతో రాణించగా, వృద్ధిమాన్ సాహా 47 పరుగులు చేసి ఔటయ్యాడు.
కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్ చెరో రెండు వికెట్లు తీశారు.
Hardik Pandya led from the front when the going got tough & he becomes our ? performer from the first innings of the #LSGvGT contest in the #TATAIPL ??
A look at his batting summary ? pic.twitter.com/dWi706ZeHz
— IndianPremierLeague (@IPL) April 22, 2023
ఇరు జట్ల ప్లేయింగ్XI..
గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్.
ఇంపాక్ట్ ప్లేయర్స్: KS భరత్, జెషువా లిటిల్, జయంత్ యాదవ్, నూర్ అహ్మద్ మరియు దసున్ షనక.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.
ఇంపాక్ట్ ప్లేయర్స్: కృష్ణప్ప గౌతమ్, జయదేవ్ ఉనద్కత్, డేనియల్ సైమ్స్, ప్రేరక్ మన్కడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..